ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడు 'పీలే'. మైదానంలో ఆయన నైపుణ్యం గురించి కథలు కథలుగా చెబుతారు. పాత వీడియోలు చూస్తే అతడి ఆటతీరు కళ్లకు కడుతుంది. అయితే ఆటగాడిగా మెరుపు వేగంతో దూసుకెళ్లిన పీలే ఇప్పుడు.. కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడట. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న 79 ఏళ్ల పీలేకు కొన్ని శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా పెద్దగా కోలుకోలేదు. ఆధారం లేకుండా సొంతంగా నడవలేకపోతున్న పీలే.. చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు.
కొన్నేళ్లుగా ఆయన బయటెక్కడా కనిపించడం లేదు. ఆటగాడిగా ఉన్నపుడు పాదరసంలా కదిలిన తాను.. ఇప్పుడు కనీసం నడవలేని స్థితిలో ఉండటం వల్ల ఆయన సిగ్గుపడి బయటికి రావట్లేదట. ఈ విషయాన్ని పీలే తనయుడు ఎడినో తెలిపాడు.