India ICC failures Yuvraj: మిడిలార్డర్‌లో సరైన బ్యాటర్ లేకపోవడం.. మంచి ప్రణాళిక ఉండకపోవడమే ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియా వైఫల్యాలకు కారణాలని మాజీ ఆటగాడు యువరాజ్‌సింగ్ అన్నాడు. "2011లో ప్రపంచకప్ గెలిచినప్పుడు నిర్దిష్టమైన స్థానాలకు బ్యాటర్లు ఉన్నారు. కానీ 2019 ప్రపంచకప్‌కు సరైన ప్రణాళిక లేదు. కేవలం 5-7 వన్డేల అనుభవమున్న విజయ్ శంకర్‌ను నాలుగో స్థానం కోసం ఎంపిక చేశారు. 4 వన్డేలాడిన రిషబ్ పంత్‌ను అతని బదులు నాలుగో స్థానంలో ఆడించారు" అని యువరాజ్ చెప్పుకొచ్చాడు.
'అతడిని ఎలా ఆడిస్తారు?'.. ఐసీసీ టోర్నీల్లో భారత్ వైఫల్యాలపై యువీ - ఇండియా వరల్డ్ కప్ ఐసీసీ
India ICC failures Yuvraj: ఐసీసీ టోర్నీల్లో భారత్ వైఫల్యాలపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మిడిలార్డర్‌లో సరైన ఆటగాళ్లు లేకపోవడం టీమ్‌కు ప్రతికూలంగా మారిందని అన్నాడు. సరైన ప్రణాళిక లేకుండా అనుభవం లేని ఆటగాళ్లకు పెద్ద పీట వేశారని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
"ఆ సమయంలో ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడు అనుభవం జట్టుకు పనికొచ్చేది. 2003 ప్రపంచకప్ ఆడే సమయానికి మహ్మద్ కైఫ్, దినేశ్ మోంగియా, నాకు 50 వన్డేలాడిన అనుభవం ఉంది. టీ20 క్రికెట్లోనూ మిడిలార్డర్ సమస్య లేకపోలేదు. టీమ్‌ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఫ్రాంఛైజీ క్రికెట్లో టాప్ ఆర్డర్‌లో ఆడతారు. ప్రపంచకప్‌కు సిద్ధమయ్యే ఆటగాళ్లు నిర్దిష్టమైన స్థానాల్లో ఆడటం ముఖ్యం. గత టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ప్రధాన లోపం అదే’’ అని అన్నాడు.
ఇదీ చదవండి:క్రికెట్ అకాడమీ కోసం ప్లాట్.. 33ఏళ్ల తర్వాత రిటర్న్ ఇచ్చిన గావస్కర్