తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Final: టీమ్ఇండియా తుది జట్టు ఇదేనా! - డబ్ల్యూటీసీ ఫైనల్​కు టీమ్ఇండియా తుది జట్టు ఎంపిక చేసిన ఆకాష్ చోప్రా

డబ్ల్యూటీసీ ఫైనల్​ (WTC Final)కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్​ బోర్డు స్క్వాడ్​ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా తుది జట్టుకు సంబంధించి తన అంచనాలను వెల్లడించాడు మాజీ క్రికెటర్ ఆకాశ్​ చోప్రా.

akash chopra, wtc final
ఆకాశ్ చోప్రా, డబ్ల్యూటీసీ ఫైనల్

By

Published : Jun 15, 2021, 4:50 PM IST

సుదీర్ఘ ఫార్మాట్​లో ప్రపంచకప్​లా భావిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్ (World Test Championship Final)కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా​(Akash Chopra) తన డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టును ప్రకటించాడు.

చోప్రా తుది జట్టు ప్రకారం.. అందరూ భావిస్తున్నట్లుగానే రోహిత్​తో కలిసి యువ ఓపెనర్​ గిల్​ ఇన్నింగ్స్​ను ప్రారంభించనున్నాడు. ఛెతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్యా రహానెకు బ్యాటింగ్​ లైనప్​లో స్థానం కల్పించాడు. ఇక ఆరో స్థానానికి వికెట్​ కీపర్ రిషభ్ పంత్​కు అవకాశం ఇచ్చాడు. హనుమ విహారిని తన తుది జట్టులో స్థానం ఇవ్వలేదు చోప్రా.

ఇదీ చదవండి:తెరపై ద్రవిడ్ బయోపిక్.. హీరో ఎవరంటే?

సిరాజ్ ఔట్..

ఇక బౌలర్ల జాబితాలో చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నట్లుగానే ఇద్దరు స్పిన్నర్లకు చోటు కల్పించాడు ఆకాశ్. రవిచంద్రన్ అశ్విన్​తో పాటు రవీంద్ర జడేజాలను తీసుకున్నాడు. వీరు బంతితో పాటు బ్యాట్​తోనూ రాణించగలరని ఆశించాడు. ఇక పేసర్ల విషయానికొస్తే మహమ్మద్ సిరాజ్​కు మొండిచేయి చూపించాడీ మాజీ క్రికెటర్. ఇషాంత్​, బుమ్రా, షమీలకు తుది జట్టులో చోటిచ్చాడు. చాలా మంది క్రికెట్​ విశ్లేషకులతో పాటు అభిమానులు కూడా ఇదే జట్టును అంచనా వేస్తున్నారు.

ఆకాశ్ చోప్రా తుది జట్టు..

శుభ్​మన్ గిల్, రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానె, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

ఇదీ చదవండి:CWG 2022: మహిళల క్రికెట్​ షెడ్యూల్​ ప్రకటన

ABOUT THE AUTHOR

...view details