ఇటీవలే కరోనా బారినపడిన టీమ్ఇండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కోలుకున్నాడు. దీంతో త్వరలో జట్టుతో కలిసి ఇతడు ఇంగ్లాండ్ బయలుదేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఐపీఎల్ ముగిశాక దిల్లీలో క్వారంటైన్లో ఉన్న సాహా కోలుకుని కోల్కతాలోని తన ఇంటికి చేరుకున్నాడు.
సాహాకు నెగిటివ్.. ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధం! - వృద్ధిమాన్ సాహా కొవిడ్ నెగిటివ్
టీమ్ఇండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా ఇతడికి కరోనా నెగిటివ్ రాగా దిల్లీ నుంచి కోల్కతాలోని తన ఇంటికి చేరుకున్నాడు.
సాహా
ఇంగ్లాండ్ టూర్ కోసం బయల్దేరనున్న టీమ్ఇండియా ఆటగాళ్లు ముందుగా ముంబయిలో క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ బయోబబుల్లోకి వెళ్లాలంటే సాహాకు మరో ఆర్టీ పీసీఆర్ టెస్టులో నెగిటివ్ రావాల్సి ఉంటుంది.