తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సాహా.. నా పరువు, విశ్వసనీయత దెబ్బతీశాడు'

Wriddhiman saha journalist: భారత క్రికెటర్ వృద్ధిమన్ సాహాను ఓ జర్నలిస్టు బెదిరించిన ఘటన ఇటీవల కాలంలో వివాదాస్పదమైంది. గత కొన్నిరోజుల నుంచి ఇదే విషయమై తెగ చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ జర్నలిస్టు ఎవరో తెలిసిపోయింది. స్వయంగా ఆ జర్నలిస్టే ప్రజల ముందుకు వచ్చి సాహాపై ఆరోపణలు చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే?

వృద్ధిమాన్​ సాహా
Wriddhiman saha

By

Published : Mar 7, 2022, 11:33 AM IST

Wriddhiman saha journalist: టీమ్‌ఇండియా క్రికెటర్‌ వృద్ధిమాన్‌ సాహాను బెదిరించిన ఆ జర్నలిస్టు ఎవరో తెలిసిపోయింది. స్వయంగా ఆ జర్నలిస్టే.. ప్రజలముందుకు వచ్చాడు. ఇటీవల ఓ జర్నలిస్టు తనను ఇంటర్వ్యూ కోసం బెదిరించాడని.. సాహా అందుకు సంబంధించిన వాట్సాప్‌ స్క్రీన్‌షాట్లను ట్విట్టర్​లో బహిర్గతం చేశాడు. దీంతో ఆ జర్నలిస్టు ఎవరనే విషయం తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఆ వ్యక్తి పేరు వెల్లడించాలని కోరారు. కానీ, సాహా నోరు విప్పలేదు. ఇక బీసీసీఐ ఇటీవల ఆ విషయంపై విచారణ చేపట్టగా ఆ జర్నలిస్టు పేరు వెల్లడించాడు. కానీ, మీడియా ముందు చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే సదరు జర్నలిస్టే స్వయంగా సాహా తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని అన్నాడు.

'ప్రతి కథకి రెండు పార్శ్యాలు ఉంటాయి. వృద్ధిమాన్‌ సాహా నా వాట్సాప్‌ స్క్రీన్‌షాట్లను తప్పుడుగా చూపించి నా పరువు, విశ్వసనీయతను దెబ్బతీశాడు. ఈ విషయంలో నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలని బీసీసీఐని కోరాను. మా లాయర్లు సాహాకు పరువునష్టం నోటీసులు జారీ చేస్తారు' అని చెప్పి అనేక విషయాలను వెల్లడించాడు. కాగా, ఆ జర్నలిస్టు ఎవరో కాదు.. క్రీడా ప్రపంచంలో చాలా మందికి పరిచయమున్న వ్యక్తే. ఆయనే బోరియా మజుమ్‌దార్‌.

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గతనెల టీమ్‌ఇండియా జట్టు సభ్యుల్ని ఎంపిక చేశారు. అందులో సాహాతో పాటు పలువురు సీనియర్‌ క్రికెటర్లను సైతం సెలెక్షన్‌ కమిటీ పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలోనే మజుమ్‌దార్‌.. సాహా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించాడని అర్థమవుతోంది. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లనే బహిర్గతం చేశాడు. అదే సమయంలో టీమ్‌ఇండియా కీపర్‌.. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అంతకుముందు జట్టులో తన స్థానంపై ఏం చెప్పారో కూడా మీడియా ముందు చెప్పాడు. దీంతో సాహా పతాక శీర్షికల్లో నిలిచాడు.

ఇదీ చదవండి:అతడు ఇంకా క్షమాపణలు చెప్పలేదు: సాహా

ABOUT THE AUTHOR

...view details