తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరల్డ్​కప్ - భారత్ గ్రాండ్ విక్టరీ, జడ్డూ స్పిన్​ మ్యాజిక్​కు చేతులెత్తేసిన సఫారీలు - ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా లైవ్​ స్కోర్

IND VS SA World Cup 2023
IND VS SA World Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 1:43 PM IST

Updated : Nov 5, 2023, 8:47 PM IST

20:44 November 05

  • 234 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ
  • 27.1 ఓవర్లలో 83 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
  • జడ్డూ స్పిన్​ మ్యాజిక్​కు చేతులెత్తేసిన సఫారీలు
  • షమీ 2, కుల్​దీప్ 2, సిరాజ్ 1 వికెట్ దక్కించుకున్నారు
  • సెంచరీ హీరో విరాట్​కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు

19:36 November 05

  • పట్టుబిగించిన భారత బౌలర్లు
  • 40 పరుగులకే 5 వికెట్లు డౌన్
  • సౌతాఫ్రికా స్కోర్ 42-5 (14 ఓవర్లు)
  • క్రీజులో జాన్సన్ (2), మిల్లర్ (0)

19:10 November 05

  • రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
  • బవుమా (11) క్లీన్ బౌల్డ్ చేసిన రవీంద్ర జడేజా
  • సౌతాఫ్రికా స్కోర్ 27-2 (9 ఓవర్లు)
  • క్రీజులో వాన్​డర్​ డస్సెన్ (9), మర్​క్రమ్ (1)

18:38 November 05

  • భారత్​కు బ్రేక్ ఇచ్చిన సిరాజ్
  • డికాక్ (5) క్లీన్ బౌల్డ్​ ఔట్
  • సౌతాఫ్రికా స్కోర్ 6-1 (2 ఓవర్లు)
  • క్రీజులో బవూమా (0), రస్సీ వాన్​డర్​ డస్సెన్ (0*)

18:03 November 05

  • ముగిసిన భారత్ ఇన్నింగ్స్
  • టీమ్ఇండియా స్కోర్ 325 -5 (50 ఓవర్లు)
  • విరాట్ కోహ్లీ (101), రవీంద్ర జడేజా (29)
  • ఒక్కో వికెట్ దక్కించుకున్న ఎంగ్డీ, రబాడా,మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, షంసీ
  • సౌతాఫ్రికా టార్గెట్ 326 పరుగులు

17:46 November 05

  • సెంచరీ నమోదు చేసిన విరాట్
  • కెరీర్​లో 49వ శతకంతో సచిన్ రికార్డు సమం
  • విరాట్ (100), జడేజా (14)
  • భారత్ స్కోర్ 309-5 (49 ఓవర్లు)

17:15 November 05

  • నాలుగో వికెట్ డౌన్, కేఎల్ రాహుల్ (8) ఔట్
  • 42.1 ఓవర్​ వద్ద భారీ షాట్​కు రాహుల్ ప్రయత్నం
  • అద్భుతంగా క్యాచ్ అందుకున్న రస్సీ వాన్​డర్ డస్సెన్
  • క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ (0), విరాట్ 78
  • భారత్ స్కోర్ 253-4 (43 ఓవర్లు )

16:49 November 05

  • మూడో వికెట్ కోల్పోయిన టీమ్ఇండియా
  • శ్రేయస్ అయ్యర్ (77) ఔట్
  • ఎంగ్డీ బౌలింగ్​లో క్యాచౌట్​గా పెవిలియన్​కు అయ్యర్
  • క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ 1*
  • విరాట్ 73*
  • భారత్ స్కోర్ 233-3 (38 ఓవర్లు)

16:28 November 05

  • సెంచరీ పార్ట్​నర్​షిప్ పూర్తి
  • అద్భుతంగా రాణిస్తున్న విరాట్, అయ్యర్
  • భారత్ స్కోర్ 202-2 (33.3 ఓవర్లు)
  • క్రీజులో విరాట్ 57, అయ్యర్ 64

16:12 November 05

  • హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకున్న విరాట్ - అయ్యర్​
  • వన్డే కెరీర్​రో 71వ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన విరాట్, కాగా అయ్యర్​కు ఇది 17 ఫిఫ్టీ
  • భారత్ స్కోర్ 189-2 (30.4 ఓవర్లు)
  • క్రీజులో విరాట్ 54, అయ్యర్ 55

15:48 November 05

  • 50 పరుగుల పార్ట్​నర్​షిప్​ కంప్లీట్
  • భారత్ స్కోర్ 143-2 ( 24.5ఓవర్లు)
  • క్రీజులో విరాట్ 42, అయ్యర్ 24

15:36 November 05

  • నిలకడగా రాణిస్తున్న విరాట్ - అయ్యర్​
  • 21 ఓవర్లు పూర్తి
  • భారత్ స్కోర్ 127-2
  • క్రీజులో విరాట్ 39, అయ్యర్ 12

14:53 November 05

  • భారత్​కు మరో షాక్
  • 10.3 ఓవర్ల వద్ద గిల్ ఓట్
  • బ్యాట్​ను మిస్సైన బంతి.. వికెట్ల అంచున తగిలింది
  • భారత్ స్కోర్ 93-2
  • క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ 0*
  • విరాట్ కోహ్లీ 19*

14:47 November 05

  • 10 ఓవర్లు పూర్తి
  • భారత్ స్కోర్ 91-1
  • గిల్ 23*
  • విరాట్ 18*

14:32 November 05

  • తొలి వికెట్ కోల్పోయిన భారత్
  • 5.5 ఓవర్ల వద్ద రోహిత్ ఔట్
  • రబాడా బౌలింగ్​లో క్యాచౌట్​గా వెనుదిరిగిన కెప్టెన్
  • భారత్ స్కోర్ - 62-1
  • క్రీజులో శుభ్​మన్ గిల్ 12*
  • విరాట్ కోహ్లీ 0*

12:36 November 05

IND VS SA World Cup 2023

IND VS SA World Cup 2023 : వన్డే ప్రపంచకప్​ 2023లో భాగంగా కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా టీమ్​ఇండియా ​- సౌతాఫ్రికా మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆడిన ఏడు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న భారత్​.. వరుసగా ఆరు విజయాలతో గెలిచి రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్​ గెలుచుకున్న టీమ్ ఇండియా బ్యాటింగ్​ ఎంచుకుంది. సౌతాఫ్రికా బౌలింగ్​కు దిగనుంది. ఈ మ్యాచ్​తో ప్రపంచకప్‌ టోర్నీలో టీమ్‌ఇండియా అజేయంగానే సెమీస్‌కు చేరుతుందా? అగ్రస్థానంతోనే లీగ్‌ దశను ముగిస్తుందా? లేదా అనే ప్రశ్నలకు సమాధానం దొరకనుంది.

అయితే నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమి తప్ప.. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా మంచి ఫామ్​లోనే ఉంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచుల్లో ఆస్ట్రేలియాను 134, ఇంగ్లాండ్‌ను 229, న్యూజిలాండ్‌ను 190 పరుగుల తేడాతో ఓడించింది. అంతే కాకుండా ప్రపంచ కప్​లో అత్యధిక స్కోరు (428/5)ను నమోదు చేసి రికార్డుకెక్కింది. దీంతో పాటు ఇంకో మూడుసార్లు 350+ స్కోర్లు సాధించి చెలరేగుతోంది.

మరోవైపు టీమ్ఇండియా కూడా తమ జోరును ప్రదర్శిస్తోంది. బ్యాటింగ్​, బౌలింగ్​ ఇలా అన్నింటిలో పటిష్టంగా ఉంది. రోహిత్‌, కోహ్లీ లాంటి సీనియర్​ ప్లేయర్స్​ నిలకడగా రాణించి.. జట్టుకు కీలక ఇన్నింగ్స్​ను అందిస్తున్నారు. కేఎల్​ రాహుల్‌ కూడా తనవంతు సహకారాన్ని అందిస్తున్నాడు. శుభ్‌మన్‌, శ్రేయస్‌ల కూడా గత మ్యాచుల్లో మంచి స్కోర్​ సాధించి జట్టుకు అండగా నిలిచారు. ఇక ఇంగ్లాండ్‌పై మంచి ఇన్నింగ్స్‌ ఆడిన సూర్య కూడా తన ఫామ్​ను చాటుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈడెన్‌లో ఉన్న పరిస్థితులు బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేని నేపథ్యంలో మన బ్యాటర్లు కొంచెం జాగ్రత్తగా ఆడాల్సిందే అని విశ్లేషకుల మాట.

ఇక దక్షిణాఫ్రికా జట్టులోని పేసర్లలో జాన్సన్‌, కొయెట్జీ నిలకడగా రాణిస్తున్నారు. ఆ జట్టుకు ఎంగిడి, రబాడల అనుభవం కూడా కలిసొచ్చే అంశం. రబాడకు భారత్‌పై మంచి రికార్డుంది. ఈడెన్‌లో స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌తో ముప్పు తప్పకపోవచ్చు. ఈ మ్యాచ్‌కు భారత్‌ తుది జట్టును మార్చే అవకాశాలు లేనట్లే అనిపిస్తోంది.

Last Updated : Nov 5, 2023, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details