World Cup 2023 Special Incidents :2023 ప్రపంచకప్ 45 లీగ్, 3 నాకౌట్ మ్యాచ్‌లతో టోర్నీ ముగిసింది. ఆస్ట్రేలియా అత్యధికంగా ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ ఫలితం మినహా.. పరుగుల వరద, వికెట్ల వేట, అబ్బురపరిచే క్యాచ్‌లు, కళాత్మక సిక్స్‌లు, ఫీల్డింగ్ విన్యాసాలు ఒక్కటేమిటి ఎన్నో విధాలుగా ఈ టోర్నీ టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు మస్త్ మజానిచ్చింది. అయితే వీటితో పాటు ఈ వరల్డ్‌కప్‌లో మరికొన్ని ప్రత్యేకమైన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అవేంటంటే..
విరాట్ @ 50..టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. ఈ టోర్నీలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతడు సెమీస్‌లో న్యూజిలాండ్‌పై బాదిన శతకంతో.. వన్డే కెరీర్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఈక్రమంలో అతడు సచిన్ తెందూల్కర్(49)ను దాటేశాడు.
షమి..భారత పేస్ బౌలర్.. అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అంతే వచ్చిన అవకాశాన్ని అతడు దూరం చేసుకోలేదు. టోర్నీలో 23 వికెట్లు దక్కించుకున్నాడు. అయితే సెమీస్‌లో న్యూజిలాండ్‌పై షమీ నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా.. 7 వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు.
ఆసీస్‌ను వణికించిన కివీస్.. టోర్నీ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మ్యాచ్‌లో.. ఆసీస్ 388 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో కివీస్కూడా దూకుడుగా ఆడింది. ఓ దశలో కివీస్ గెలుస్తుందనిపించింది. కానీ, చివర్లో వికెట్లు కోల్పోవడం వల్ల 16 పరగుల తేడాతో ఓడింది.