Smriti Mandhana: టీమ్ఇండియా ప్రమాదకర ద్వయం పట్ల తమ జట్టు అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పింది ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ. 2022 మహిళల ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మార్చి 18న తలపడనుంది ఆసీస్. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన పెర్రీ.. స్మృతి, కౌర్‌లను ప్రశంసిస్తూనే.. వారితో పోటీని ఆస్వాదిస్తామని చెప్పింది.
"టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్‌లో ఉన్న పవర్ గురించి అవగాహన ఉంది. స్మృతి, హర్మన్‌ప్రీత్ కచ్చితంగా చాలా డేంజరస్ బ్యాటర్లు. ఇద్దరూ ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్ ఆడారు. ఆ టోర్నీలో సెంచరీలు బాదినట్టు ఉన్నారు. మేము పరస్పరం చాలా మ్యాచ్‌లు ఆడాం. కాబట్టి భారత్‌తో మ్యాచ్ కోసం ఎలా సన్నద్ధమవ్వాలో తెలుసు. వారితో మ్యాచ్ సవాలే. మా మధ్య పోరు గొప్పగా ఉండబోతోంది."