తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC Afghanistan: టీ20 ప్రపంచకప్​లో అఫ్గాన్​పై ఐసీసీ వేటు? - టీ20 ప్రపంచకప్

అక్టోబర్​లో జరగబోయే టీ20 ప్రపంచకప్​లో అఫ్గానిస్థాన్ క్రికెట్​ జట్టు(Afghan Cricket News) పాల్గొనడం సందేహంగా మారింది. అందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు పాలక వర్గంలో తాలిబన్లు(Afghanistan Cricket Taliban) జోక్యం చేసుకోవడం ప్రధాన కారణమని తెలుస్తోంది. క్రికెట్​ బోర్డుల్లో ప్రభుత్వాల జోక్యం ఉంటే ఆ బోర్డులను నిషేధం విధిస్తుంది.

ICC Afghanistan
టీ20 ప్రపంచకప్

By

Published : Sep 23, 2021, 7:45 AM IST

ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్​లో ఎదుగుతున్న అఫ్గానిస్థాన్‌పై (Afghan Cricket News) తాలిబన్ల రూపంలో గట్టి దెబ్బ పడింది. దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్ల కారణంగా ఇప్పుడా జట్టు వచ్చే నెలలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడం సందేహంగా మారింది. క్రికెట్‌ బోర్డుల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఐసీసీ ఆ బోర్డులపై నిషేధం విధిస్తుంది. ఇప్పటికే అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) పాలక వర్గంలో తాలిబన్లు (Afghanistan Cricket Taliban) మార్పులు చేశారు. క్రికెట్‌ ఆడకుండా తమ దేశ అమ్మాయిలను నిషేధించారు.

తాలిబన్ల జెండాతోనే?

ఇక తాలిబన్ల రాజ్యంలో శక్తిమంతమైన హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన నసీబుల్లా హక్కానీ.. హమీద్‌ స్థానంలో ఏసీబీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup Afghanistan) ఆ దేశ జాతీయ పతాకానికి బదులుగా తాలిబన్ల జెండా (Taliban Flag) పెట్టాలనే డిమాండ్‌ వచ్చే అవకాశముందని ఐసీసీ భావిస్తోంది. ఒకవేళ అలాంటి విజ్ఞప్తి వచ్చినా ఐసీసీ దాన్ని తిరస్కరిస్తుంది. ఇతర జట్లు కూడా తాలిబన్ల జెండా కిందా అఫ్గాన్‌తో ఆడేందుకు ఒప్పుకుంటారో లేదో అనే విషయంపై స్పష్టత లేదు.

"ఇప్పటికైతే తాలిబన్ల జెండా కిందా అఫ్గాన్‌ క్రికెట్‌ ఆడాలనే విజ్ఞప్తి ఏం రాలేదు. ఒకవేళ ఏదైనా క్రికెట్‌ బోర్డుపై ఐసీసీ(ICC Afghanistan) నిషేధం విధించినా ఆటగాళ్లపై ఆ ప్రభావం పడకుండా చూసుకుంటుంది. ఐసీసీ సభ్య దేశంగా ఉండాలంటే.. ఆ దేశంలో పురుషులతో పాటు మహిళల క్రికెట్‌ కూడా ఉండాలి" అని ఓ ఐసీసీ బోర్డు సభ్యుడు తెలిపాడు. ఇప్పటికే అఫ్గాన్‌లో మహిళల క్రికెట్‌ను నిషేధించడం వల్ల ఐసీసీ నిబంధనలు అతిక్రమించినట్లయింది.

పాక్‌తో సిరీస్‌:

తమ దేశంలో అంతర్జాతీయ సిరీస్‌ల నిర్వహణ దిశగా అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు (Afghanistan Cricket Board) అడుగులు వేస్తోంది. తమ దేశంలో పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏసీబీ కొత్త ఛైర్మన్‌ అజీజుల్లా ఫాజిల్‌ బుధవారం తెలిపాడు. భారత్‌, బంగ్లాదేశ్‌, యూఏఈ క్రికెట్‌ బోర్డుల అధికారులతోనూ సమావేశమవుతానని అజీజుల్లా వెల్లడించాడు.

ఇదీ చూడండి:IPL 2021: ముంబయిని కోల్​కతా అడ్డుకోగలదా?

ABOUT THE AUTHOR

...view details