వెస్టిండీస్ క్రికెట్లో గత వైభవాన్ని తాను మళ్లీ చూస్తానని అనుకోవట్లేదని పేస్ దిగ్గజం కర్ట్‌లీ ఆంబ్రోస్ అన్నాడు. వెస్టిండీస్‌కు క్రికెట్‌తో ఉన్న బంధం ఈతరం కరీబియన్ కుర్రాళ్లకు అర్థం కావట్లేదని చెప్పాడు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన విండీస్ 1975, 1979లో వన్డే వరల్డ్‌కప్‌లను గెలిచింది. 33 ఏళ్ల విరామం తర్వాత 2012లో టీ20 ప్రపంచకప్‌ను సాధించింది.
'వెస్టిండీస్ క్రికెట్‌కు పూర్వ వైభవం.. కష్టమే!' - కర్ట్‌లీ ఆంబ్రోస్
క్రికెట్లో వెస్టిండీస్‌కు పూర్వ వైభవం వస్తుందని తాను అనుకోవడం లేదని తెలిపాడు బౌలింగ్ దిగ్గజం కర్ట్‌లీ ఆంబ్రోస్. గొప్ప ఆటగాళ్లుగా ఎదిగే సమర్థత ఈ తరం క్రికెటర్లలో ఉన్నప్పటికీ.. విండీస్‌కు గత వైభవం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.
"క్రికెట్‌తో వెస్టిండీస్‌కు ఉన్న అనుబంధం ఈతరం కుర్రాళ్లలో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కరీబియన్ ప్రజలను కలిపి ఉంచే ఏకైక క్రీడ ఇది. నా ఉద్దేశం ఇప్పుడున్న విండీస్ క్రికెటర్లను అగౌరవపరచడం కాదు. గొప్ప ఆటగాళ్లుగా ఎదిగే సమర్థత ఉన్న ఆటగాళ్లు కొందరున్నారు. కానీ ఎప్పటికైనా విండీస్ క్రికెట్‌కు పూర్వవైభవం వస్తుందని నేను అనుకోవట్లేదు" అని ఆంబ్రోస్ అభిప్రాయపడ్డాడు. రిచర్డ్స్, హేన్స్, లారా, మార్షల్, హోల్డింగ్, రాబర్ట్స్ లాంటి ఆటగాళ్లు ఇప్పుడు రావడం చాలా కష్టమని పేర్కొన్నాడు. 1988 నుంచి 2000 వరకు వెస్టిండీస్‌కు ఆడిన 57 ఏళ్ల ఆంబ్రోస్ 98 టెస్టుల్లో 405 వికెట్లు పడగొట్టాడు.
ఇదీ చదవండి:సింగపూర్ ఓపెన్‌కు సాయిప్రణీత్ దూరం.. కారణమిదే..