టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు గతకొన్నాళ్లుగా బ్యాటింగ్‌లో విఫలమవుతున్న టీమ్ఇండియా నయావాల్ పుజారాను పక్కన పెట్టాలని యాజమాన్యం భావిస్తోంది! ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా అతడి బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
పేలవ ప్రదర్శనతో..
భారత్ నయా వాల్‌గా పేరొందిన ఛెతేశ్వర్ పుజారా సాధారణ టెస్టు సగటు 46.49. అయితే 2020 నుంచి అతడు ఆడిన మూడు సిరీస్‌లను పరిశీలిస్తే సగటు 26.35కే పరిమితమైంది. గత 30 ఇన్నింగ్స్‌లో పుజారా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అందులో 9 మ్యాచ్‌లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే వెనుదిరిగాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో టెస్టులో 77 పరుగులు చేసి పర్వాలేదు అనిపించినా.. మిగతా మ్యాచ్‌ల్లో చతికిలపడ్డాడు.