టీమ్‌ఇండియా బ్యాటర్ హనుమ విహారిని(Hanuma Vihari News) న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు(IND vs NZ Test Series) కాకుండా ఇండియా-ఏ తరఫున దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన సెలక్టర్లపై మండిపడ్డాడు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా(Ajay Jadeja news).
కివీస్‌తో ఈనెల 25 నుంచి భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆపై డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలోనే విహారిని సెలెక్టర్లు.. ఇండియా- ఏ జట్టుకు ఎంపిక చేశారు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన జడేజా సెలెక్టర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
"విహారిని తలచుకుంటే బాధేస్తుంది. కొంత కాలంగా టీమ్‌ఇండియాతో పర్యటిస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా రాణిస్తున్నాడు. అతడేం తప్పు చేశాడు? ఇండియా-ఏ జట్టుతో ఎందుకు వెళ్లాలి? స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఎందుకు ఆడకూడదు? అది కుదరకపోతే ఇండియా-ఏ పర్యటనకు కూడా పంపకూడదు. ఇన్ని రోజులూ జట్టుతో కలిసి ఉన్న ఆటగాడు ఇప్పుడు ఇండియా-ఏ తో ఆడుతుంటే.. మరోవైపు జట్టులో కొత్త కుర్రాళ్లు వచ్చి ఆడుతుండటం లాంటివి క్రికెట్ అభిమానులను గందరగోళానికి గురిచేస్తాయి"
-- అజయ్ జడేజా, మాజీ క్రికెటర్.