తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్, రాహుల్​కు గాయమైతే బ్యాకప్ ఓపెనర్ ఎవరు?' - దినేశ్ కార్తిక్ కేఎల్ రాహుల్

టీమ్ఇండియా బ్యాకప్ ఓపెనర్​పై దృష్టిసారించాలని సూచించాడు సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్(dinesh karthik news). రోహిత్, రాహుల్(kl rahul news) గాయపడితే వారి స్థానంలో ఎవరు ఆడతారనే సందేహం అందరిలోనూ ఉందన్నాడు.

Rohit
రోహిత్

By

Published : Nov 20, 2021, 7:01 PM IST

టీమ్‌ఇండియా బ్యాటర్లు రోహిత్‌ శర్మ(rohit sharma news), కేఎల్ రాహుల్‌(kl rahul news) ఓపెనర్లుగా అదరగొడుతున్నారని.. అయితే, వారికి ఒక బ్యాకప్ ఆటగాడిని చూడాలని సీనియర్‌ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌(dinesh karthik news) అన్నాడు. తాజాగా అతడు ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరిలో ఎవరికైనా గాయాలైతే బ్యాకప్‌ ఆటగాడు ఉండాలని అభిప్రాయపడ్డాడు.

"నాకో సందేహం ఉంది. వాళ్లిద్దరిలో ఎవరికైనా గాయమైతే ప్రత్యామ్నాయంగా ఉండే మూడో ఓపెనర్‌ ఎవరు? జట్టు యాజమాన్యం అలాంటి ఆటగాడిని కనుగొనాల్సి ఉంది. జట్టులో ముగ్గురు ఓపెనర్లకు మించిన అవసరం రాదనుకుంటా. అదొక్కటే నా అనుమానం. ఈ విషయంపై జట్టు యాజమాన్యం దృష్టిసారించాలి. మూడో ఓపెనర్‌గా సరైన బ్యాట్స్‌మన్‌ను కనుగొనాలి" అని కార్తీక్‌(dinesh karthik news) అన్నాడు.

అలాగే టీమ్‌ఇండియాలో ఇప్పుడు చాలా మంది బ్యాటర్లు ఉన్నారని, అందులో బాగా ఆడే కొందరి పేర్లు కూడా కార్తీక్(dinesh karthik news) సూచించాడు. లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్లలో ఇషాన్‌ కిషన్‌, శిఖర్‌ ధావన్‌ ఉన్నారని, రైట్‌హ్యాండ్‌ బ్యాటర్లలో రుతురాజ్‌ గైక్వాడ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌(venkatesh iyer news) ఉన్నారని గుర్తుచేశాడు. ఓపెనర్లుగా రోహిత్‌-రాహుల్‌ ఇప్పటికే నిరూపించుకున్నారని, ఇక కివీస్‌తో ఆదివారం తలపడే మూడో టీ20లో ఒకరు తప్పుకొని మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని కోరాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ కల్లా సరైన మూడో ఓపెనర్‌ను తయారు చేయాలని, అతడు వీరిద్దరితో సమానంగా పరుగులు చేసేలా ఉండాలని డీకే(dinesh karthik news) చెప్పుకొచ్చాడు.

ఇవీ చూడండి: 'బుమ్రా, హర్షల్ కాంబో.. డెత్ ఓవర్లలో ప్రత్యర్థికి చుక్కలే'

ABOUT THE AUTHOR

...view details