తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ, కోహ్లీ కాదు.. భారత​ ధనిక క్రికెటర్​ ఎవరు? - విరాట్ కోహ్లీ

క్రికెటర్లకు సంబంధించి ఆదాయాలు చెబితే ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు. అయితే మన దేశంలోని క్రికెటర్లలో ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న జాబితా ఇటీవల వెలువడింది. అందులో తొలి స్థానంలో ఉన్నది ఎవరో తెలుసా?

Who is India's richest cricketer?
ధోనీ, కోహ్లీ కాదు.. భారత​ ధనిక క్రికెటర్​ ఎవరు?

By

Published : Jul 2, 2021, 6:05 PM IST

Updated : Jul 2, 2021, 7:59 PM IST

ఆటగాళ్లకు సంబంధించిన ఆదాయాల గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తిగానే ఉంటుంది. అందులోనూ క్రికెటర్ల గురించి అయితే అభిమానులు ఎక్కడలేని ఆసక్తి చూపిస్తారు. ఇంతకీ మన దేశంలోని బాగా ధనవంతుడైన క్రికెటర్​ ఎవరో తెలుసా?

సచిన్ తెందుల్కర్..

'గాడ్​ ఆఫ్ ఇండియన్​ క్రికెట్'​గా పేరుపొందిన సచిన్​ తెందుల్కర్​.. దేశంలోని అత్యంత సంపన్న ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి నికర ఆస్తుల విలువ రూ.1090 కోట్లు. దీంతో పాటు వివిధ ఎండార్స్​మెంట్లు, స్పాన్సర్​షిప్ ఒప్పందాలు, ఖరీదైన కార్లు అతడి ఆస్తుల జాబితాలో ఉన్నాయి.

ఫెర్రారీ 360 మోడెనా, నిస్సాన్ జీటీ, బీఎండబ్ల్యూ ఎం-5, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ ఎక్స్​5ఎం, బీఎండబ్ల్యూ ఎం6.. సచిన్​ దగ్గర ఉన్న కార్లు. వీటిల్లో అత్యంత ఖరీదైన కారు మాత్రం బీఎండబ్ల్యూ ఐ8. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన క్రికెటర్లలోనూ లిటిల్​ మాస్టర్​ ఒకడు.

ధోనీ@2..

సచిన్ తర్వాత స్థానంలో ఉన్నది మాత్రం మాజీ కెప్టెన్ ధోనీనే. అతడి ఆస్తుల విలువ రూ.767 కోట్లు. ఆధునిక క్రికెట్​ ప్రపంచంలో విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. టీమ్ఇండియాకు రెండు ఆసియాకప్​లతో పాటు ఛాంపియన్స్​ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్​, వన్డే ప్రపంచకప్(2011) ఇతడి కెప్టెన్సీలోనే గెలిచుకుంది భారత్.​ దీంతో మహీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది.

మూడో స్థానంలో కోహ్లీ..

భారత సారథి విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ రూ.638 కోట్లు. అతడు భారత క్రికెట్​ బోర్డుతో పాటు ఐపీఎల్​లో బెంగళూరు జట్టుకు ఆడుతూ సంపాదిస్తున్నాడు. వీటితో పాటు వివిధ ప్రచారాల ద్వారా కూడా ఆదాయం పొందుతున్నాడు. ఖరీదైన కార్ల నుంచి ఆకర్షణీయమైన వాచ్​లు విరాట్ దగ్గర ఉన్నాయి.

ఫోర్బ్స్​ గతేడాది ప్రకటించిన అత్యధిక వార్షిక సంపాదకుల జాబితాలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రూ.193 కోట్లతో 100వ స్థానం నుంచి 66వ స్థానానికి చేరుకున్నాడు.

ఇదీ చదవండి:Dhoni: క్రికెటర్​గానే కాదు భర్తగా.. ఓ మంచి తండ్రిగా!

Last Updated : Jul 2, 2021, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details