West Indies Players Corona: వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్..! పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ఆ జట్టులో ముగ్గురు ఆటగాళ్లతో పాటు సిబ్బంది ఒకరికి కరోనా నిర్ధరణ అయినట్లు విండీస్ బోర్డు ప్రకటించింది.
విండీస్‌కు గట్టి దెబ్బ.. ముగ్గురు ఆటగాళ్లకు కరోనా - షెల్డన్ కాట్రెల్ కరోనా
West Indies Players Corona: పరిమిత ఓవర్ల సిరీస్ కోసం పాకిస్థాన్ వెళ్లిన వెస్టిండీస్ జట్టులో ముగ్గురికి కరోనా సోకింది. అయితే సిరీస్ మాత్రం యాథావిధిగా జరుగుతుందని ప్రకటించింది విండీస్ క్రికెట్ బోర్డు.
పాకిస్థాన్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు కరీబియన్ జట్టు గురువారం కరాచీకి చేరుకుంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా రోస్టన్ ఛేజ్, షెల్డన్ కాట్రెల్, కైల్ మేయర్స్‌తో పాటు మరో వ్యక్తి వైరస్ బారినపడినట్లు తేలింది. దీంతో వీరిని ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రానికి తరలించినట్లు ఆ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఇక మిగతా ఆటగాళ్లు అందరికీ నెగెటివ్‌గా రావడంతో ఈరోజు నుంచి వారు ప్రాక్టీస్ మొదలుపెడతారని చెప్పింది. సిరీస్ అనుకున్నట్లే యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించింది.