శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో ఆరు మార్పులతో బరిలోకి దిగిన ధావన్ సేన.. అందులో ఐదుగురు కొత్త ప్లేయర్స్‌ను తీసుకుంది. అయితే ఇందుకు గల కారణం సహా మ్యాచ్ ఓటమిపై స్పందించాడు కెప్టెన్ ధావన్.
"మేం కొత్త ఆటగాళ్లతో ప్రయత్నించాము. మాకు మంచి ఆరంభం దొరికింది కానీ ఆ తర్వాత మిడిల్ఓవర్లలో చాలా వికెట్లు కోల్పోయాం. చివర్లో 50 పరుగులు తక్కువ చేశాం. ఏదేమైనప్పటికీ.. వారంతా అరంగేట్రం చేయడం ఆనందంగా ఉంది. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్నాం. వారంతా కూడా చాలా కాలం క్వారంటైన్లో గడిపారు. అందుకే ఈ చివరి మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి వారిని ఆడిపించాలనుకున్నాం. ఆట విషయానికొస్తే.. ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించడం సహా తప్పులను సరిచేసుకుని ఎలా మెరుగుపరుచుకోవాలో విశ్లేషించుకుంటుంటాను. టీ20 సిరీస్ కోసం ఎదురుచూస్తున్నాను. అయినా సిరీస్ మొత్తం సానుకూల దృక్పథంతోనే ఉన్నాం. కుర్రోళ్లు బాగా ఆడారు చివర్లో ఆసక్తికరంగా ఆట సాగింది. మేము ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం."
-ధావన్, కెప్టెన్
సంజు శాంసన్, నితీశ్ రాణా, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియా, రాహుల్ చాహర్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని 39 ఓవర్లలోనే లంక జట్టు ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' వరించింది. కాగా, మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత జట్టు కైవసం చేసుకుంది.
రికార్డులు
ఒక వన్డేలో అరంగేట్ర ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యలో పడగొట్టిన వికెట్లు(ఇండియా)
1974లో ఇంగ్లాండ్‌పై ఆరు వికెట్లు
1980లో ఆస్ట్రేలియాపై ఆరు
2021లో శ్రీలంకపై ఆరు
2021 ఇంగ్లాండ్‌పై ఐదు
విన్నింగ్ స్ట్రీక్ బ్రేక్..