ICC Player of The Month: నవంబర్ నెలకు సంబంధించి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' విజేతలను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను ఈ అవార్డు వరించగా.. మహిళల్లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హేలీ మ్యాథ్యూస్ విజేతగా నిలిచింది.
ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా వార్నర్ - Hayley Matthews
ICC Player of The Month: నవంబర్ నెలకు గానూ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో పాటు మహిళల్లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హేలీ మ్యాథ్యూస్ విజేతలుగా నిలిచారు.
david warner news
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను తొలిసారి ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు వార్నర్. దీంతో నవంబర్‌కు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ఉన్న అబిద్ అలీ, టిమ్ సౌథీలను దాటి విజేతగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది ఐసీసీ.
ఇదీ చూడండి:Team India Quarantine: మూడు రోజుల క్వారంటైన్లో టీమ్ఇండియా