విరాట్ కోహ్లి తన అభిమానులకు మరోసారి షాకిచ్చాడు. టీ20 ప్రపంచకప్ వరకే భారత టీ20 జట్టుకు సారథిగాఉంటానని చెప్పిన ఈ స్టార్ క్రికెటర్ ఐపీఎల్‌లోనూ (IPL) కెప్టెన్ ఇన్నింగ్స్ ముగించాలని నిర్ణయించుకున్నాడు. నాయకుడిగా ఈ సీజనే తనకు ఆఖరిదని ఆదివారం ప్రకటించాడు. క్రికెటర్‌గా తన కెరీర్ ముగిసే వరకు బెంగళూరు జట్టుతో (kohli rcb) కొనసాగుతానని చెప్పాడు.
"ఆర్‌సీబీ కెప్టెన్‌గా (kohli rcb captaincy) ఇదే నా చివరి ఐపీఎల్. ఇది తేలికైన నిర్ణయం కాదు. కానీ.. ఫ్రాంఛైజీ ప్రయోజనాల దృష్ట్యా సరైందని భావిస్తున్నా. నాపై నమ్మకం ఉంచిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. ఇది చిన్న మజిలీ మాత్రమే. ప్రయాణం ముగిసినట్లు కాదు. నా చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు బెంగళూరు జట్టుకే ఆడతాను. మరే జట్టులోనూ నన్ను ఊహించుకోలేనని యాజమాన్యానికీ స్పష్టం చేశా. టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఐపీఎల్‌లోనూ సారథ్య బాధ్యతలకు దూరం కావాలని ఆలోచిస్తున్నా. ఆర్‌సీబీ జట్టుకు నాయకత్వం.. గొప్ప, స్ఫూర్తిదాయక ప్రయాణం. ఈ అవకాశం కల్పించిన మేనేజ్‌మెంట్‌కు, నా ప్రయాణంలో భాగమైన కోచ్‌లు, ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలు"
- విరాట్ కోహ్లీ