Virat Kohli Stumps Swap :భారత్, సౌతాఫ్రికా మధ్య హోరాహోరీగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీలు ప్రస్తుతం దూకుడుగా ఆడుతోంది.అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా రన్స్ మెషిన్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
అసలేం జరిగిందంటే ?
రెండో రోజు సెకెండ్ సెషన్‌ను నిలకడగా ఆడుతున్న సఫారీలను విరాట్ కోహ్లీ తన మ్యాజిక్‌తో పెవిలియన్ బాట పట్టించాడు. అలా 93 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ఉన్న సౌతాఫ్రికా ప్లేయర్స్ డీన్ ఎల్గర్, టోని డీ జోర్జీ జోడీని జస్‌ప్రీత్ బుమ్రా ఔట్ చేశాడు. టోనీ డీ జోర్జీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే కీగన్ పీటర్సన్(2)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా 9 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ ఇద్దరూ ఔటవ్వకుముందు కోహ్లీ వికెట్ బెయిల్స్ మార్చాడు.
ప్రస్తుతం కోహ్లీ చేసిన ఈ పని నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీని చూసిన ఫ్యాన్స్ ఓ వైపు నవ్వుకంటూనే మరోవైపు 'ఏం మ్యాజిక్ చేశావయ్యా' అంటూ కామెంట్లు పెడుతున్నారు.