తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ సమయంలో ధోనీ పంపిన మెసేజ్​ మనసును తాకింది: కోహ్లీ - T20 world cup kohli innings

తాను ఫామ్​ కోల్బోయి ఇబ్బంది పడుతున్న సమయంలో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ ఏమని చెప్పాడో గుర్తుచేసుకున్నాడు స్టార్​ బ్యాటర్​ కోహ్లీ. ఏం అన్నాడంటే..

dhoni msg to kohli
కోహ్లీకి ధోనీ స్పెషల్​ మెసేజ్

By

Published : Nov 7, 2022, 12:23 PM IST

కష్టాల్లో ఉన్న సహచరులకు ధైర్యం చెప్పడంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. యువ క్రికెటర్లకు స్ఫూర్తిమంతం. ఇదే విషయాన్ని చాలా మంది ఆటగాళ్లు చెప్పారు. అందులో టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కోహ్లీ కూడా ఒకడు.

గతేడాది టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత స్పందించిన ఏకైక వ్యక్తి ధోనీ అని విరాట్ చెప్పాడు కదా.. తాజాగా ధోనీ గురించి మరో విషయం కూడా కోహ్లీ బయటపెట్టాడు. ఫామ్‌ కోల్పోయి (శతకాలను చేయలేదంతే) ఇబ్బంది పడిన సందర్భంలో చాలా మంది సలహాలు ఇచ్చారని.. అయితే ధోనీ మాత్రమే ప్రత్యేకంగా సందేశం పెట్టాడని గుర్తు చేసుకొన్నాడు. అది తన మనసుకు బాగా తాకిందని చెప్పాడు.

"క్లిష్ట సమయాల్లో నాకు బాసటగా నిలిచిన వ్యక్తి ఎంఎస్ ధోనీ. అది నాకు కచ్చితంగా ఆశీర్వాదం లాంటిదే. నాకు సీనియర్‌ అయిన ధోనీతో ఇలాంటి బలమైన బంధం, స్నేహం కలిగి ఉండటం ఎప్పటికీ మరువలేను. ఇక ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడి విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ధోనీ పంపిన సందేశం నా మనసును తాకింది. అందులో ఉన్న విషయం తెలిసిందే అయినా చెప్పిన విధానం నచ్చింది. 'నువ్వు బలంగా ఉండాలని అనుకున్నప్పుడు.. దృఢమైన వ్యక్తిగా కన్పిస్తున్నప్పుడు.. నువ్వు ఎలా ఆడుతున్నావ్‌? అని అడగటం ప్రజలు మర్చిపోతారు' అని ధోనీ చెప్పారు. ఇదే నన్ను బలంగా తాకింది. ఎందుకంటే ఎప్పుడూ నన్ను ఆత్మవిశ్వాసంతో, మానసికంగా బలంగా ఉండే వాడిగా.. ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి రాణించేవాడిగానే చూసేవారు. అయితే జీవితంలో ఏదొక సమయంలో ఓ రెండు అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి తప్పదని గ్రహించాల్సి ఉంటుంది. అలాగే ఉన్నతంగా రాణించేందుకు ఏం చేస్తున్నారో కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది" అని విరాట్ వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌ల్లో 246 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉండటం విశేషం. పాకిస్థాన్‌పై 82* పరుగులతో అదరగొట్టే ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ భారత్‌ గెలవడం

ఇదీ చూడండి:ఈ బుడ్డోడు ఇప్పుడు భారత స్టార్​ క్రికెటర్​.. క్రీజులో ఉంటే బౌలర్లకు చుక్కలే!

ABOUT THE AUTHOR

...view details