తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ ఫామ్​పై పదే పదే ప్రశ్న.. వాళ్లకు హిట్​మ్యాన్​ స్ట్రాంగ్​ కౌంటర్.. ​

టీమ్ఇండియా రన్నింగ్​ మెషిన్​ విరాట్​ కోహ్లీ తాజాగా జరిగిన అంతర్జాతీయ మ్యాచ్​లో సెంచరీ స్కోర్​ చేసి సత్తా చాటాడు. అయినప్పటికీ తన ఫామ్​ విషయంలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న తరుణంలో కెప్టెన్​ రోహిత్​ శర్మ మీడియా వేదికగా స్ట్రాంగ్​ రిప్లై ఇచ్చాడు. అదేంటంటే..

kohli rohith
kohli rohith

By

Published : Jul 27, 2023, 1:52 PM IST

Virat Kohli Century :టీమ్ఇండియా గత కొన్నేళ్లుగా ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ సమిష్టి కృషితో ముందుకు సాగుతూ దూసుకెళ్తోంది. గతంలో జరిగిన కొన్ని మ్యాచుల్లో విజయాలను తమ ఖాతాల్లో వేసుకోగా.. కొన్నింటిలో ఓటమితో వెనుదిరిగింది. ప్లేయర్స్​లో ఉన్న చెక్కు చెదరని విశ్వాసం తమ జట్టుకు బలాన్ని చేకురుస్తోంది. రోహిత్​, విరాట్​, రహానే లాంటి సీనియర్ బ్యాటర్లతో పాటు శుభ్​మన్​ గిల్​, యశస్వి జైస్వాల్​, ఇషాన్​ కిషన్ లాంటి ప్లేయర్లను కలిగిన టీమ్​ఇండియా.. తాజాగా జరిగిన విండీస్​ టెస్ట్​లో చెలరేగిపోయింది. వెస్టిండీస్​ టూర్​లో ఏమాత్రం తగ్గని భారత ప్లేయర్లు మైదానంలో దూసుకెళ్లి సెంచరీలు, అర్ధ సెంచరీలను తమ ఖాతాల్లోకి వేసుకున్నారు. అయితే ఇప్పుడు అందరి ద ఏస్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై పడింది. విండీస్​ టెస్ట్​లో మంచి ఫామ్ కనిపించినప్పటికీ.. అతని ఆట తీరు ఇంకొంచం మెరుగుపడాలంటూ కామెంట్లు వెల్లువవుతున్నాయి.

Virat Kohli Test : సెంచరీ కోసం ఎదురుచూసిన కోహ్లీ.. గత కొంత కాలంగా ఫామ్​ విషయంలో కాస్త తడబడుతూ వస్తున్నాడు. దాదాపు ఐదేళ్ల పాటు ఓవర్సీస్​లో ఒక్క సెంచరీని కూడా తన ఖాతాలోకి వేసుకుని విరాట్​.. వెస్టిండీస్​తో జరిగిన టెస్ట్​తో తన సత్తా చాటాడు. తాజాగా జరిగిన 500వ అంతర్జాతీయ మ్యాచ్​లో 181 బంతుల్లో కోహ్లr తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయినప్పటికీ కోహ్లీ ఫామ్ విషయంలో విలేకరుల నుంచి పదే పదే అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. సందర్భంతో తేడా లేకుండా మీడియా సమావేశాల్లో తప్పక ఈ ప్రశ్నను అడుగుతూ కనిపిస్తున్నారు. దీంతో విస్తుపోయిన టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఘాటుగా సమాధానమిచ్చాడు. ఈ ప్రశ్నకు ఇప్పటికే చాలా సార్లు సమాధానమిచ్చానని చెప్పిన రోహిత్​.. 'డ్రెస్సింగ్​ రూంలో ఏం జరుగుతుందో ఇలా మాట్లాడేవాళ్లకి తెలియదంటూ కామెంట్​ చేశాడు.

"నేను ఈ ప్రశ్నకు ఇప్పటికే చాలాసార్లు సమాధానం ఇచ్చాను. ఎవరు ఎంత స్కోర్ చేశారు, ఎన్ని వికెట్లు తీశారు లాంటి మాటలు బయట కూర్చున్న వ్యక్తులు బాగానే చర్చిస్తారు. కానీ వారు మాట్లాడే సమయంలో లోపల ఏమి జరుగుతుందో వారికి తెలియదు. అంతర్గతంగా జరిగే చర్చలు లోపలే ఉంటాయి. అవి అక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాము. అలాంటి విషయాలన్నింటిని మేము పట్టించుకోము. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను ఇక భవిష్యత్తులోనూ ఇదే చెబుతాను. మేము సిరీస్‌ ఎలా గెలుస్తాం అన్న విషయంపై దృష్టి సారిస్తాము. ఎవరు ఏమి మాట్లాడుతున్నార విషయంపై కాదు." అని రోహిత్​ విలేకరుల ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details