Virat Kohli Dean Elgar Video :దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. కేప్‌టౌన్‌లో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన జెశ్చర్‌తో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. చివరి సారి మైదానంలోకి అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు డీన్ ఎల్గర్‌ను అభినందించి హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రెండో టెస్టులో డీన్ ఎల్గర్ ఆఖరిసారి క్రీజులో అడుగుపెట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఎల్గర్ 12 పరుగులకే ఔటయ్యాడు. భారత బౌలర్ ముకేశ్ కుమార్ వేసిన ఓవర్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఎల్గర్‌ను హగ్ చేసుకుని 'టేక్ ఏ బౌ' జెశ్చర్‌తో అభినందించాడు విరాట్. దాంతోపాటు అతడికి స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాలని ప్రేక్షకులకు సూచించాడు. అనంతరం అభిమానులు, మిగతా ప్లేయర్ల కరతాళ ధ్వనుల మధ్య డీన్ ఎల్గర్ మైదానం నుంచి బయటకు వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోతో పాటు డీన్ ఎల్గర్‌ను కోహ్లీ హగ్ చేసుకున్న ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది. 'పిక్ ఆఫ్ ది డే' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
IND Vs SA 2nd Test : సిరీస్‌ను నిర్ణయించే రెండో టెస్టు మొదటి రోజు రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలను కేవలం 55 పరుగులకే ఆల్ఔట్ టేసింది టీమ్ఇండియా. బెడింగమ్ (12), వెరినే (15) మినహా మిగతావారందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. మహ్మద్ సిరాజ్ ఏకంగా 6 వికెట్లు నేలకూల్చి ప్రత్యర్థి జట్టును తీవ్రంగా దెబ్బ తీశాడు. జస్ప్రీత్ బుమ్రా 2, ముకేశ్ కుమార్ 2 వికెట్లు దక్కించుకున్నారు. కాగా, టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాకు ఇదే అతి తక్కువ స్కోర్ కావడం విశేషం.