తెలంగాణ

telangana

ETV Bharat / sports

Sachin: వారికి మనమంతా అండగా ఉండాలి - sachin tendulkar wishes to athlets

టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) పాల్గొనే భారత అథ్లెట్స్​ బాగా ఆడాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​(Sachin Tendulkar). ప్రతిఒక్కరూ వారికి మద్దతుగా నిలవాలని కోరాడు.

sachin
సచిన్​

By

Published : Jul 6, 2021, 6:49 PM IST

టోక్యో ఒలింపిక్స్‌(Tokyo Olympics).. ప్రపంచమంతా ఈ అంతర్జాతీయ పోటీల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. ఇంకొద్దీ రోజుల్లో ప్రారంభం కానున్న ఈ పోటీలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం కానున్నాయి. ఈ సందర్భంగా మెగాక్రీడల్లో పాల్గొనబోయే క్రీడాకారులను ఉద్దేశిస్తూ మాట్లాడిన భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​... భారత అథ్లెట్స్​ బాగా ఆడాలని ఆకాంక్షించాడు. వారందరికీ యావత్​ దేశం ప్రోత్సాహం అందించాలని కోరాడు.

"కరోనా ప్రారంభమైనప్పటి నుంచి అథ్లెట్స్​ అందరూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ వారు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా శిక్షణ చేస్తూనే ఉన్నారు. ఒలింపిక్స్​లో వారంతా ఉత్తమంగా రాణిస్తారని ఆశిస్తున్నాను. మన అథ్లెట్లు బాగా శ్రమించారు. ప్రస్తుతం వారికి మన ప్రోత్సాహం అవసరం.చీర్​ ఫర్​ ఇండియా" అని సచిన్​ అన్నాడు.

గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. వైరస్‌ ఉద్ధృతి కాస్త నెమ్మదించడం వల్ల జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జపాన్‌ రాజధాని టోక్యోలో మెగాక్రీడలు కొవిడ్‌ నియమ నిబంధనలతో జరగనున్నాయి. మొత్తం 115 మంది భారత క్రీడాకారులు ఇందులో పాల్గొననున్నారు. ప్రారంభ వేడుకలో త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించే అవకాశం దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌, జాతీయ పురుషుల హాకీ జట్టు సారథి మన్‌ప్రీత్‌ సింగ్‌లకు దక్కింది. భారత ఒలింపిక్‌ కమిటీ (ఐఓఏ) సోమవారం వీళ్లిద్దరినీ పతాకధారులుగా ప్రకటించింది. రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరిస్తాడు.

ఇదీ చూడండి: Sachin&Mithali: ఆ విషయంలో సచిన్-మిథాలీ ఒకటే!

ABOUT THE AUTHOR

...view details