న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20 సిరీస్(IND vs NZ t20 series)ను టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్ చేసేసింది. నవంబర్ 25 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ను ఆడేందుకు సమయాత్తమవుతోంది. టీ20 సిరీస్ విజయంపై మాజీల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును అద్భుతంగా నడిపారని కొనియాడారు. అయితే టీమ్‌ఇండియా బ్యాటింగ్ లైనప్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సూచించాడు.
"సూర్యకుమార్ యాదవ్ ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. త్వరలోనే అతడు స్థిరత్వం అలవర్చుకుంటాడని ఆశిస్తున్నా. రోహిత్ కెప్టెన్సీ బాగుంది. అయితే టీమ్‌ఇండియా మిడిలార్డర్ విఫలం కావడం కలవరపెట్టే అంశం. టీ20 ప్రపంచకప్‌లోనూ దీనివల్లే భారత్ సెమీస్‌కు చేరలేకపోయింది. సూర్య ఇప్పుడు 30+ వయసులో ఉన్నాడు. ఎంతో పరిణితి చెందిన ఆటగాడు. చాలా దేశవాళీ క్రికెట్ ఆడాడు. అతడిని ఇషాన్, రిషభ్ పంత్‌తో పోల్చడం సరికాదు. వారిద్దరూ ఇంకా యువకులే. తక్కువ అనుభవం కలిగిన వారు. కాబట్టి సూర్యకుమార్ ఇంకా స్థిరంగా ఆడాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది."