2007 టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్ల విధ్వంసకర బ్యాటింగ్ ఎప్పటికీ చిరస్మరణీయమే. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యూవీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదుతుంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఊగిపోయింది. ఆ దెబ్బతో యూవీ సూపర్ హీరో అయిపోయాడు. అదే సమయంలో బ్రాడ్ పరిస్థితి దయనీయంగా తయారైంది. అతని క్రికెట్ భవిష్యత్తూ ప్రశ్నార్థకమైంది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ పోరు సందర్భంగా బ్రాడ్ తండ్రి, మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ స్వయంగా ఈ విషయమై తనతో మాట్లాడినట్లు యూవీ గుర్తు చేసుకున్నాడు.
ఇదీ చదవండి:WTC Final: డబుల్ ధమాకాతో మొదలై.. ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి
"ఆసీస్‌తో సెమీస్ పోరుకు స్టువర్ట్ తండ్రి క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీ. మ్యాచ్‌కు ముందు క్రిస్ నా దగ్గరికి వచ్చి 'నా కుమారుడి కెరీర్ దాదాపుగా ముగించినందుకు థ్యాంక్యూ' అని అన్నాడు. 'వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నా బౌలింగ్‌లోనూ అయిదు సిక్సర్లు కొట్టారు. ఆ బాధను అర్థం చేసుకోగలను' అని క్రిస్‌కు చెప్పా. ఆరు సిక్సర్లు కొట్టినప్పుడు ధరించిన జెర్సీని స్టువర్ట్‌కు ఇవ్వమని క్రిస్ అడిగాడు. 'ఇంగ్లాండ్ క్రికెట్ భవిష్యత్తు నువ్వు. గొప్ప ఘనతలు సాధిస్తావు' అని జెర్సీపై రాసి స్టువర్ట్‌కు ఇచ్చా. ఇప్పుడు స్టువర్ట్ ఎంతో ఎదిగిపోయాడు. టెస్టుల్లో 500కు పైగా వికెట్లు తీశాడు" అని యువరాజ్ అన్నాడు. టీమ్‌ఇండియాతో ఓ వన్డే మ్యాచ్‌లో యూవీ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ దిమిత్రి మస్కరెన్హాస్ అయిదు సిక్సర్లు బాదాడు.
ఇదీ చదవండి:IND VS SL: టీమ్‌ఇండియా కఠిన క్వారంటైన్లో