Ind vs Nz test 2: వాంఖడే వేదికగా టీమ్ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యే సమయానికి టీమ్ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్ (120), వృద్ధిమాన్ సాహా(25) ఉన్నారు.
ఆదుకున్న మయాంక్..
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(120) నిలకడగా స్కోర్‌బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. శుభ్‌గిల్ గిల్(44)తో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఛెతేశ్వర్ పుజారా క్యాచ్‌తో డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూతో డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలోనే టీ విరామం సమయానికి భారత్ 111/3 స్కోరు చేసింది. ఇక శ్రేయస్ అయ్యర్(18)కే వెనుదిరిగాడు.
వృద్ధిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్ న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఇదీ చదవండి:ind vs nz test: మయాంక్ అగర్వాల్ సెంచరీ- టెస్టుల్లో నాలుగో శతకం