తెలంగాణ

telangana

ETV Bharat / sports

సఫారీలపై భారత్​ ఘన విజయం.. 2-1 తేడాతో సిరీస్​ కైవసం - india south africa odi series 2022

సఫారీలపై 7 వికెట్ల తేడాతో భారత్​ ఘన విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

india south africa odi series 2022
india south africa odi series 2022

By

Published : Oct 11, 2022, 6:35 PM IST

దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో భారత్​ ఘన విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. మొదట టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. చెలరేగి ఆడింది. 27.1 ఓవర్లలో 99 పరుగులకే సఫారీలను ఆల్​ ఔట్​ చేసింది.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్​ బౌలర్ల.. ధాటికి సఫారీ బ్యాటర్లు చతికిల పడ్డారు. కుల్​దీప్ యాదవ్​ మెరుపు ప్రదర్శన చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్​ సుందర్​, మహ్మద్ సిరాజ్​, షహబాజ్​ అహ్మద్ రెండు చొప్పున వికెట్లు తీశారు. సఫారీ జట్టులో క్లాసెన్​, మలాన్, యాన్​సెన్ మినహా మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్​కే పరిమితమయ్యారు.

మొదట టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా.. ఆది నుంచే విజృంభించింది. మూడో ఓవర్లోనే మొదటి వికెట్​ను పడగొట్టింది. ఓపెనర్​గా వచ్చిన డికాక్ ఆరు పరుగులకే వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ మలన్ 27 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం వచ్చిన హెండ్రిక్స్(3), మాక్రమ్​(9) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన క్లాసెన్​ మంచి ప్రదర్శనతో జట్టును గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. చూడముచ్చటైన షాట్లతో 42 బంతుల్లో 34 నాలుగు పరుగులు చేశాడు. అనంతరం షహబాజ్ బౌలింగ్​లో ఔట్​ అయ్యాడు. ఇక మిగిలిన బ్యాటర్లంతా వచ్చినంతసేపు కూడా క్రీజులో ఉండలేదు. డేవిడ్​ మిల్లర్(7)​, ​పెహ్లుక్వాయో(5), పోర్టిన్(1), నోకియా(0), ఎంగిడి(0) పేలవ ప్రదర్శన చేశాడు. యాన్​సెన్(14) ఫర్వాలేదనిపించాడు.

భారత్​ ఛేసింగ్ అదరగొట్టింది. 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. శుభ్​మన్​ గిల్ (49) తో అద్భుత ప్రదర్శన చేసి మెరిశాడు. ఓపెనర్ ధావన్ 14 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇషన్​ కిషన్​ 18 బంతుల్లో 10 పరుగులు చేశాడు. శ్రేయస్​ అయ్యర్​ (28) పరుగులు చేశాడు. సంజు శాంసన్(2) పరుగులు చేశాడు.

ABOUT THE AUTHOR

...view details