తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లీష్ జట్లతో ప్రాక్టీస్​ మ్యాచ్​కు ఈసీబీ నో - బీసీసీఐ ప్రాక్టీస్ మ్యాచ్

ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్​లు లేకుండా బరిలో దిగి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఓటమిపాలైంది టీమ్ఇండియా. దీంతో ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ ముందు అయినా ప్రాక్టీస్ మ్యాచ్​లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది బీసీసీఐ. కాగా ఈసీబీ మాత్రం ఇందుకు నిరాకరించింది.

Team India
టీమ్ఇండియా

By

Published : Jun 26, 2021, 7:40 AM IST

ఎప్పుడో మార్చిలో టెస్టు క్రికెట్‌ ఆడింది టీమ్‌ఇండియా. ఆ తర్వాత భారత ఆటగాళ్లు ఐపీఎల్‌లో మునిగిపోయారు. ఆ టోర్నీ మధ్యలో ఆగిపోగా.. పెద్దగా ప్రాక్టీస్‌ లేకుండానే న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆడాల్సి వచ్చింది. ఈ ప్రాక్టీస్‌ లేమే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌ను దెబ్బ తీసిందన్నది స్పష్టం.

అయితే కనీసం ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ముంగిట అయినా భారత్‌కు వార్మప్‌ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ దిశగా ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)కు బీసీసీ నుంచి విన్నపం కూడా వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి. కానీ భారత్‌కు ఇంగ్లీష్‌ జట్లతో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడించే ఉద్దేశమే ఈసీబీకి లేదని స్పష్టమవుతోంది. ప్రాక్టీస్‌ కోసం భారత్‌ అంతర్గత మ్యాచ్‌లు ఆడుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

డర్హమ్‌లో ఈ తరహా మ్యాచ్‌లు రెండు ఉంటాయట. "కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో ఆగస్టులో తొలి టెస్టు ఆరంభానికి ముందు భారత జట్టు రెండు అంతర్గత మ్యాచ్‌లు ఆడుతుంది" అని ఈసీబీ ప్రతినిధి తెలిపారు. ఇంగ్లాండ్‌ దేశవాళీ జట్లతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఉండవా అని అడిగితే.. ఈసీబీ ప్రతినిధి "లేదు" అనే సమాధానం ఇచ్చాడు.

ఇవీ చూడండి: 'డబ్ల్యూటీసీ ఓడినా.. 20 రోజులు హాలీడేసా'?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details