తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ టోర్నీలో ఆడేదెవరో నాకు తెలుసు- మా ఫైనల్ టార్గెట్ అదే!' - India T20 Captain

Team India Squad T20 World Cup 2024: 2024 పొట్టి ప్రపంచకప్​నకు ఎంపికయ్యే టీమ్ఇండియా స్వ్కాడ్​పై తనకు ఓ అవగాహన ఉందన్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. జట్టు ఎంపికపై కోచ్​ ద్రవిడ్​తో కలిసి కసరత్తులు చేస్తున్నట్లు చెప్పాడు.

Team India Squad T20 World Cup 2024
Team India Squad T20 World Cup 2024

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 6:51 AM IST

Updated : Jan 19, 2024, 8:59 AM IST

Team India Squad T20 World Cup 2024:2024 టీ20 వరల్డ్​కప్​నకు భారత జట్టు ఇంకా ఖరారు కాలేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అయితే మినీకప్​ టోర్నమెంట్​లో ఆడే 8-10 ప్లేయర్లెవరో తనకు తెలుసు అని పేర్కొన్నాడు. ​ఒక జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నప్పుడు ఆటగాళ్లందరినీ సంతృప్తి పరచడం కష్టమేనని రోహిత్ అన్నాడు.

'వన్డే వరల్డ్​కప్​లాగే టీ20 ప్రపంచకప్​నకు కూడా జట్టు ఎంపికపై కసరత్తు చేస్తున్నాం. ఈ క్రమంలో అనేక మంది ప్లేయర్లను పరిశీలనలోకి తీసుకుంటున్నాం. కానీ, అందులో అత్యుత్తమ ఆటగాళ్లు మాత్రమే జట్టులో చోటు దక్కించుకుంటారు. కొందరికి నిరాశ తప్పదు. టోర్నీలో ఆడే 8 నుంచి 10మంది ప్లేయర్లు మా దృష్టిలో ఉన్నారు. వెస్టిండీస్​లో పిచ్​లు పొడిగా ఉంటాయి. అందుకు తగ్గట్లు ప్రదర్శన చేసేవారే జట్టులో ఉంటారు. ఈ విషయాన్ని రాహుల్ భాయ్ (ద్రవిడ్​)తో చర్చించా. ఏదేమైనా మా దృష్టి జట్టు అవసరాలపైనే ఉంటుంది' అని రోహిత్ అన్నాడు.

ఐపీఎల్​ కీలకం:పొట్టి ప్రపంచకప్​నకు ముందు భారత్​కు ఎలాంటి టీ20 మ్యాచ్​లు/సిరీస్​లు లేవు. జనవరి 25 నుంచి మార్చి 11 వరకు టీమ్ఇండియా ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ ఆడనుంది. ఆ తర్వాత ఐపీఎల్​ జరగనుంది. ఈ క్రమంలో పొట్టి ప్రపంచకప్​లో టీమ్ఇండియా తరఫున ఆడాలనుకునే యంగ్ ప్లేయర్లకు రానున్న ఐపీఎల్ అత్యంత కీలకం కానుంది. ఈ టోర్నమెంట్​లో రాణించిన ప్లేయర్లకు (ముఖ్యంగా బౌలర్లకు) టీమ్ఇండియా పిలుపు అందే ఛాన్స్ ఉంది.

టీ20 వరల్డ్​కప్​లో కెప్టెన్​గా రోహిత్!టీమ్ఇండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపు 14 నెలల తర్వాత అఫ్గానిస్థాన్​ సిరీస్​తో టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే రోహిత్ టీ20లకు దూరంగా ఉండడం వల్ల మేనేజ్​మెంట్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యను కెప్టెన్​గా నియమించింది. దాదాపు ఏడాది కాలంగా హార్దిక్ టీ20 సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే వన్డే వరల్డ్​కప్​లో గాయపడిన హార్దిక్ కొలుకోవడానికి సమయం పట్టేలా ఉంది. ఒకవేళ అతడు టీ20 ప్రపంచకప్ నాటికి కోలుకున్నా జట్టు పగ్గాలు రోహిత్​కు అప్పజెప్పేందుకే బీసీసీఐ ఆసక్తి చూపుతోందట!

రోహిత్​ 2.0 - ఇలానే విజృంభిస్తే T20 వరల్డ్​కప్​ మనదే!

విరాట్ 'సూపర్ మ్యాన్ ఫీట్'- 5 పరుగులు సేఫ్- మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!

Last Updated : Jan 19, 2024, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details