Team India ODI Ranking 2023 :ప్రపంచ కప్(ODI World Cup 2023) ముంగిట టీమ్ఇండియాకు అన్నీ శుభశకునాలే. రీసెంట్గా ఆసియా కప్ 2023 ముద్దాడిన సంబరం మర్చిపోకముందే.. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అన్ని ఫార్మాట్లలో టీమ్ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 22 జరిగిన మొదటి మ్యాచ్‌లో మనోళ్లు విజయం సాధించారు. దీంతో ఈ సిరీస్‌ను ఘనంగా ప్రారంభించడంతో పాటు.. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. ప్రస్తుతం 116 పాయింట్లతో మొదటి ర్యాంక్‌ను అందుకోగా.. పాకిస్థాన్ (115 పాయింట్లు), ఆస్ట్రేలియా (111 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియాతో సిరీస్‌ను నెగ్గితే వరల్డ్ కప్‌లో అగ్ర స్థానంతో బరిలోకి దిగే ఛాన్స్ టీమ్ఇండియాకు దక్కుతుంది.
- TeamIndia Test, T20 Rankings : ఇప్పటికే టీమ్ఇండియా.. టెస్టు, టీ20 ఫార్మాట్లో ఫస్ట్ ప్లేస్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ సిరీస్‌ను గెలుచుకోవడం, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు వెళ్లడం, వెస్టిండీస్‌పై టెస్ట్ సిరీస్ సాధించడం వల్ల టెస్టుల్లో టీమ్ఇండియా 118 పాయింట్లతో అగ్ర స్థానానికి కైవసం చేసుకుంది. టీమ్ఇండియా తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియా 118 పాయింట్లు, ఇంగ్లాండ్ 115 పాయింట్లతో కొనసాగుతున్నాయి.
- గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు వెళ్లడం, ద్వైపాక్షిక సిరీసుల్లోనూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేయడంతో.. టీ20ల్లోనూ టీమ్ఇండియా ఫస్ట్ ప్లేస్‌కు చేరుకుంది. 2021 టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 సిరీసుల్లో కేవలం ఒక్క సిరీస్‌లో మాత్రమే టీమ్ఇండియా ఓడిపోయింది. దీంతో టీమ్ఇండియా 264 పాయింట్లు, ఇంగ్లాండ్ 261 పాయింట్లు, పాకిస్థాన్ 254 పాయింట్లతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
- ఇలా మొత్తంగా మూడు ఫార్మాట్లలోనూ టీమ్ఇండియా అగ్ర స్థానాన్ని దక్కించుకోవడం ఇదే మొదటి సారి. టీమ్ ఇండియా కన్నా ముందు 2012లో సౌత్ ఆఫ్రికా ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు టీమ్ ఇండియా ఆ లిస్ట్‌లో చేరింది.