తెలంగాణ

telangana

ETV Bharat / sports

లార్డ్స్​లో బుమ్రా, షమీకి ఘనస్వాగతం.. కారణం అతడే! - ఆర్ శ్రీధర్ బుమ్రా

లార్డ్స్ మైదానంలో చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించారు టీమ్ఇండియా పేసర్లు బుమ్రా(jasprit bumrah), షమీ(Mohammed Shami). అయితే లంచ్ విరామ సమయంలో వీరిద్దరూ డ్రెస్సింగ్ రూమ్​కు వచ్చినప్పుడు భారీ ఎత్తున ఘనస్వాగతం లభించింది. దీనికి కారణం కోహ్లీ అని వెల్లడించాడు భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ వెల్లడించాడు.

Bumrah Shami
బుమ్రా, షమీ

By

Published : Aug 23, 2021, 8:02 PM IST

లార్డ్స్ మైదానంలో ఇటీవల ఇంగ్లాండ్‌తో ఆడిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 151 పరుగులతో ఘన విజయం సాధించింది. అయితే, ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్‌ షమీ(56*), జస్ప్రిత్‌ బుమ్రా(34*)కు భారత ఆటగాళ్లు ఎప్పటికీ గుర్తుండిపోయే తీపిజ్ఞాపకం అందించారు. ఐదోరోజు ఉదయం 209 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో పడిన జట్టును వారిద్దరూ ఆదుకున్నారు. భోజన విరామ సమయానికి ఈ జోడీ 80 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి టీమ్‌ఇండియాను మెరుగైన స్థితిలో నిలిపారు. దాంతో వారు డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చేసరికి జట్టు సభ్యులంతా ఘన స్వాగతం పలకాలని కెప్టెన్‌ కోహ్లీ ముందే అందరికీ చెప్పాడని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ వెల్లడించారు. తాజాగా అశ్విన్‌తో యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు.

"భోజన విరామంలో బుమ్రా(jasprit bumrah), షమీ(Mohammed Shami) డ్రెస్సింగ్‌ రూమ్‌కు చేరుకుంటున్నారని తెలియగానే కోహ్లీ వాళ్లకు ఘన స్వాగతం పలకాలని జట్టు సభ్యులందరితో అన్నాడు. వాళ్లు చేసే శబ్దానికి లార్డ్స్‌ మైదానం దద్దరిల్లాలని, అది కొన్నేళ్లపాటు గుర్తుండిపోవాలని కెప్టెన్‌ పేర్కొన్నాడు" అని శ్రీధర్‌ వివరించారు.

కాగా, కోహ్లీ చెప్పినట్లే జట్టు సభ్యులంతా ఆ ఇద్దరికీ చప్పట్లతో ఘనస్వాగతం పలికారు. వారిని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఆ వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లోనూ పంచుకుంది. ఇక రెండో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే కెప్టెన్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. అప్పుడు బుమ్రా, షమీ మరో 9 పరుగులు జోడించారు. దాంతో టీమ్‌ఇండియా స్కోర్‌ 298/8కి చేరుకుంది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ 120 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్‌లోనూ బుమ్రా అదరగొట్టాడు. అతడు మూడు వికెట్లు తీయగా షమీ ఒక వికెట్‌ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇవీ చూడండి: రోహిత్ సక్సెస్ వెనుక రవిశాస్త్రి.. సవాల్​ చేసి మరీ!

ABOUT THE AUTHOR

...view details