టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం పాక్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ (79*), కెప్టెన్ బాబర్ అజామ్ (68*) భారీ భాగస్వామ్యంతో పాక్‌కు విజయాన్ని అందించారు. భారత బౌలర్లు ఎంత కష్టపడినా వికెట్ దక్కలేదు. టీమ్ఇండియా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాక్ బ్యాటర్లు నింపాదిగా తమపని చేసుకుని వెళ్లిపోయారు. బ్యాటింగ్, బౌలింగ్ సహా అన్నిరంగాల్లో రాణించిన పాకిస్థాన్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్ పోటీల్లో భారత్‌పై పాకిస్థాన్ తొలి విజయం సాధించడం విశేషం.
టీమ్ఇండియాపై పాకిస్థాన్ ఘన విజయం
22:57 October 24
22:18 October 24
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్(34), మహ్మద్ రిజ్వాన్(35) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లు కోల్పోకుండా 71 పరుగులు చేశారు.
22:04 October 24
పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. టీమ్ఇండియా బౌలర్లు వేస్తున్న బంతులను ఓపెనర్లుగా బరిలో దిగిన కెప్టెన్ బాబర్ అజామ్(18), మహ్మద్ రిజ్వాన్(27) జాగ్రత్తగా ఎదుర్కొంటున్నారు. ఏడు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లను కోల్పోకుండా 46పరుగులు చేశారు.
21:13 October 24
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడ్డారు. పాక్ బౌలర్ల దెబ్బకు కోహ్లీ(57), పంత్(39) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఫలితంగా ప్రత్యర్థి జట్టు ముందు ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 3, హసన్ అలీ 2, షదాబ్ ఖాన్, హరీష్ రాఫ్ తలో వికెట్ తీశారు.
21:09 October 24
20:36 October 24
ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్న పంత్‌ను(39; 6x2, 4x2) కట్టడి చేశాడు షాదబ్ ఖాన్. దీంతో 12.4 ఓవర్లకు 84/4స్కోరు నమోదైంది. క్రీజులోకి జడేజా వచ్చాడు. కోహ్లీ(29) ఆచితూచి ఆడుతున్నాడు.
20:25 October 24
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమ్ఇండియా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. పాక్ బౌలర్లు టీమ్ఇండియా బ్యాటర్లపై విరుచుకుపడుతున్నారు. తొలి పది ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది టీమ్ఇండియా.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లుగా దిగిన రోహిత్‌శర్మ(0), కేఎల్ రాహుల్(3).. తొలి రెండు ఓవర్లోనే షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఐదో ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ హసన్ అలీ బౌలింగ్ షాట్‌కు యత్నించి కీపర్ రిజ్వాన్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక మూడో స్థానంలో వచ్చిన కోహ్లీ(26; 6x1, 4x1) జాగ్రత్తగా ఆడుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(26), పంత్(19; 4x2) ఉన్నారు.
19:59 October 24
పాక్ బౌలర్లు జోరు చూపిస్తున్నారు. టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నారు. ఐదో ఓవర్లో దూకుడుగా ఆడిన సూర్యకుమార్ యాదవ్‌ను(11) హసన్ అలీ అడ్డుకున్నాడు. యాదవ్ షాట్‌కు యత్నించి కీపర్ రిజ్వాన్ చేతికి చిక్కాడు. దీంతో 5.4 ఓవర్లకు 31గా స్కోరు నమోదైంది. క్రీజులో పంత్ రాగా.. కోహ్లీ 20 పరుగులతో కొనసాగుతున్నాడు.
19:57 October 24
ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు కోల్పోయి 30 పరగులు చేసింది టీమ్ఇండియా. క్రీజులో కోహ్లీ(15), సూర్యకుమార్ యాదవ్(11)ఉన్నారు.
19:42 October 24
టీమ్ఇండియా వరుసగా రెండో ఓవర్లో రెండో వికెట్‌ను కోల్పోయింది. కేఎల్ రాహుల్(3) షహీన్ అఫ్రిది బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి రాగా.. కోహ్లీ మూడు పరుగులతో కొనసాగుతున్నాడు.
19:34 October 24
టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. తొలి వికెట్ కోల్పోయింది. షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్‌శర్మ(0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
19:16 October 24
జట్లు:
టీమ్ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
పాకిస్థాన్: బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ , ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ అఫ్రిది
19:10 October 24
"పాకిస్థాన్‌తో మ్యాచ్ అనగానే ఒత్తిడి ఉంటుంది. అంతేకాదు బయట నుంచి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మామూలే. మేం ప్రొఫెషనల్ క్రికెటర్స్. క్రికెట్ గురించి మాత్రమే ఆలోచించాలి. మిగిలిన మ్యాచ్‌ల్లాగే ఇదొక మ్యాచ్‌లా భావించాలి. పాక్‌తో మ్యాచ్‌లో మైదానంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. కానీ మా మానసిక స్థితి, సన్నద్ధత మాత్రం ఎప్పటిలాగే ఉంటాయి. తుది జట్టు వివరాలు వెల్లడించలేను. వీలైనంత సమతూకంతో కూడిన జట్టునే పాక్‌తో మ్యాచ్‌లో బరిలో దించుతాం. ప్రస్తుతం భారత్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇటీవల ఐపీఎల్ ఆడిన అనుభవంతో ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి తమ పాత్రలేంటో స్పష్టత ఉంది. టోర్నీకి మంచి సన్నద్ధతతో వచ్చాం"
- టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లి
గతం గురించి మాకవసరం లేదు
"గతం గురించి మాకవసరం లేదు. ఈ ప్రపంచకప్‌పైనే మా దృష్టి. మా సామర్థ్యం, నైపుణ్యాలపై శ్రద్ధ పెట్టి మ్యాచ్‌లో వాటిని ప్రదర్శిస్తాం. పరిస్థితులను సాధారణంగా ఉంచడం, ప్రాథమిక అంశాలను పట్టించుకోవడం ముఖ్యం. ఇప్పటికే భారత్‌తో ప్రపంచకప్‌ల్లో ఆడాం. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన చేశాం. ఆ జట్టుతో పోరును ఎంత సాధారణంగా ఉంచితే అంత మాకే మంచిది. ప్రశాంతంగా ఉండడం ప్రధానం. షోయబ్ స్పిన్ బాగా ఆడగలడు. అందుకే సర్ఫరాజ్‌ను కాదని అతణ్ని తుది జట్టులోకి తీసుకున్నాం"
- పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్
18:46 October 24
భారత్-పాకిస్థాన్ మ్యాచ్
అభిమానులు(T20 world cup 2021 schedule) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ దుబాయ్ వేదికగా మరి కాసేపట్లో ప్రారంభంకానుంది. ముందుగా(pak india match 2021) ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది(pak vs india match schedule).
భారత్‌దే పైచేయి
ఇప్పటివరకూ ఐసీసీ టీ20 ప్రపంచకప్ పోటీల్లో పాక్‌పై భారత్‌కు(pak india match 2021) తిరుగులేని రికార్డు ఉంది. 5 సార్లు ఆడితే ఐదుసార్లూ పాక్‌ను టీమ్ఇండియా ఓడించింది. మరి ఈ ఆరో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.