తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 World Cup 2021: 'సెమీస్ పోరు ఈ నాలుగు జట్ల మధ్యే'

కొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్​పై (T20 World Cup 2021) తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఇండియా మరోసారి టైటిల్​ గెలవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే ఈసారి ఫైనల్​కు వెళ్లే జట్లు ఇవేనంటూ ఆసక్తికర ప్రకటన చేశారు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.

pak
పాక్​

By

Published : Sep 14, 2021, 10:39 PM IST

Updated : Sep 15, 2021, 8:59 AM IST

యూఏఈ, ఒమన్‌ వేదికగా అక్టోబరు 17న ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2021) కోసం క్రికెట్‌ ప్రేమికులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవడానికి అన్ని జట్లు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన దేశాలన్నీ జట్లను ప్రకటించాయి. అయితే, ఏ జట్టు విజేతగా నిలుస్తుంది, ఏ ఏ జట్లు విజయం సెమీస్‌కు చేరుతాయి అనే విషయాలపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ అంశాలపై చాలా మంది మాజీ క్రికెటర్లు విశ్లేషణలు చేస్తున్నారు. టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఆకాశ్‌ చోప్రా ట్విట్టర్​లో అభిమానులతో ముచ్చటిస్తుండగా.. 'మీ అంచనా ప్రకారం.. టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లు ఏవి' అని ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు. దీనికి బదులుగా.. 'ఇండియా, పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్' అని చోప్రా సమాధానమిచ్చాడు. ఐపీఎల్-14 సీజన్‌లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందని ఓ నెటిజన్ అడగ్గా.. 'ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌కి చేరుతాయి' అని సమాధానమిచ్చాడు.

ఇదీ చూడండి:

Last Updated : Sep 15, 2021, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details