ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే కేన్ విలియమ్సన్(sunrisers hyderabad kane williamson), డేవిడ్ వార్నర్‌లను(warner update) తమవాళ్లుగా ఇక్కడి అభిమానులు భావిస్తారు. అందుకే వాళ్లను కేన్ మామ, వార్నర్ కాకా అని పిలుస్తుంటారు. ఇప్పుడు సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించే స్పిన్నర్ రషీద్ ఖాన్(sunrisers rashid khan) కూడా వాళ్లను అలాగే పిలవడం విశేషం.
'కేన్ మామ.. వార్నర్ కాకా'.. రషీద్ ట్వీట్ వైరల్ - warner update
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో(t20 world cup 2021 final) ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ తలపడ్డాయి. ఈ పోరులో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది ఆసీస్(T20 world cup winner). ఈ సందర్భంగా కేన్ విలియమ్సన్, వార్నర్‌ను ఉద్దేశిస్తూ అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్(rashid khan latest tweet) ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
రషీద్ ఖాన్
టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు అభినందనలు తెలుపుతూ రషీద్ ట్వీట్ చేశాడు(rashid khan latest tweet). "టీ20 ప్రపంచకప్ రూపంలో మరో ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాకు అభినందనలు. న్యూజిలాండ్ ఆటగాళ్లు బాగా ఆడారు. కేన్ మామ, వార్నర్ కాకా .. ఇలా ఇద్దరి ఆటను చూడడం ఆనందంగా ఉంది" అని అతను పోస్టు చేశాడు. ఇప్పుడిది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇదీచూడండి:నేటి నుంచే ఇండోనేసియా మాస్టర్స్.. టైటిల్‌పై సింధు గురి