టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్(team india fielding coach)గా మరోసారి తెలుగువాడికే అవకాశం దక్కింది! వరంగల్‌కు చెందిన టి.దిలీప్ టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికైనట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో హైదరాబాదీ ఆర్.శ్రీధర్ స్థానంలో ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
హెచ్‌సీఏ ఎ-డివిజన్ లీగ్స్‌లో కాంటినెంటల్ సీసీ తరఫున దిలీప్ బరిలో దిగాడు. బీసీసీఐ లెవెల్-3 కోర్సు పూర్తి చేసిన దిలీప్.. 14 ఏళ్ల కోచింగ్ కెరీర్‌లో టీమ్‌ఇండియా, ఇండియా అండర్-19, ఫస్ట్‌క్లాస్ జట్లకు ఫీల్డింగ్ శిక్షకుడి(team india fielding coach)గా పని చేశాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియాకు దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో టీమ్‌ఇండియా చీఫ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్(rahul dravid head coach).. దిలీప్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ద్రవిడ్ సహచరుడు.. ఇండియా-ఎ, ఇండియా అండర్-19 జట్లకు ఫీల్డింగ్ కోచ్(team india fielding coach)గా పని చేసిన అభయ్‌శర్మను కాదని దిలీప్‌ను ఈ బాధ్యతలకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎన్‌సీఏలో అభయ్ సేవలు అవసరమని భావించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) దిలీప్‌కు ఓటు వేసినట్లు తెలిసింది. దిలీప్ ఎంపిక పట్ల హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ ఆనందం వ్యక్తం చేశారు.