ఐసీసీ టీ20 క్రికెట్లో టీమ్ఇండియా (T20 World Cup 2021) కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని దాటాడు. ఈ ఫార్మాట్లో పాక్‌పై 500 పరుగులు చేసిన భారత తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ మార్క్‌ను అందుకోవడానికి 20 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆదివారం మ్యాచ్‌లో హసన్ అలీ బౌలింగ్‌లో ఫోర్ బాది దీనిని చేరాడు.
హాఫ్ సెంచరీల్లో..
టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డ్ క్రిస్ గేల్ పేరున ఉంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ దాన్ని అధిగమించాడు. ఈ ఫార్మాట్లో పది హాఫ్ సెంచరీలు చేసిన ఘనత సాధించాడు. గేల్ తొమ్మిది హాఫ్ సెంచరీలతో ఉన్నాడు. టీమ్ఇండియాలో కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ ఏడు హాఫ్ సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.