న్యూజిలాండ్‌తో తొలి టీ20లో(IND vs NZ T20) టీమ్‌ఇండియా యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (62) దంచికొట్టాడు. అయితే, అతడు కీలక ఇన్నింగ్స్ ఆడినా చివరి దశలో బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రోహిత్ (48)తో కలిసి మ్యాచ్ గమనాన్ని మార్చేసిన సూర్య.. 17వ ఓవర్‌లో బౌల్డయ్యాడు. దీంతో టీమ్‌ఇండియా 144 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అయితే, సూర్య(surya kumar yadav news) 57 పరుగుల వద్ద ఉండగా ఓ షాట్ ఆడాడు. ఆ క్యాచ్‌ను బౌల్ట్ జారవిడిచాడు. మ్యాచ్ అనంతరం స్పందించిన సూర్య.. తన భార్య పుట్టినరోజున బౌల్ట్ ఇచ్చిన కానుక అది (క్యాచ్ వదలడం) అని సరదాగా వ్యాఖ్యానించాడు.
"ఈ మ్యాచ్‌లో కొత్తగా ఏమీ చేయలేదు. గత మూడు, నాలుగేళ్లుగా ఎలా ఆడుతున్నానో అలాగే బ్యాటింగ్ చేశా. నెట్స్‌లో ఎలాంటి సాధన చేస్తున్నానో దాన్నే మైదానంలోనూ రిపీట్ చేశాను. నా ఆట తీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకొంటాను. ఎలా ఆడితే మంచిదో ఆలోచిస్తాను. ఈ మ్యాచ్‌లో మంచు ప్రభావంతో బంతి తేలిగ్గానే బ్యాట్ పైకి వచ్చింది. దీంతో షాట్లు ఆడటం తేలికైంది. చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నా.. మేం గెలిచినందుకు సంతోషంగా ఉంది. అయితే, నేనే స్వయంగా ఈ మ్యాచ్‌ను గెలిపించి ఉంటే మరింత ఎక్కువగా ఆనందించేవాడిని. కానీ, ఇలాంటి పరిస్థితుల నుంచే మనం నేర్చుకొని ముందుకు సాగుతాం. బౌల్ట్ నా క్యాచ్ వదిలేసిన విషయానికి వస్తే.. ఈ రోజు నా భార్య పుట్టినరోజు. ఆమెకు అతడిచ్చిన సరైన బహుమానం" అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
కోహ్లీ త్యాగం మరువలేను..