తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ ఇండియాకు కొత్త కెప్టెన్​..? అతడేనా? - రిషభ్​ పంత్​ కొత్త కెప్టెన్​

టీమ్​ఇండియాకు కొత్త సారధిగా మరో పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటి వరకు ఆ స్థానానికి హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లలో ఒకరిని కెప్టెన్ చెయ్యాలని టీమ్​ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే తాజాగా మరో పేరు వినిపించడం చర్చకు దారి తీస్తోంది. ఇంతకి ఆ క్రికెటర్​ ఎవడంటే..?

Teamindia
టీమ్​ఇండియా

By

Published : Nov 15, 2022, 12:25 PM IST

టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఓటమితో ఇంటి దారి పట్టడం వల్ల టీమ్​ ఇండియా కెప్టెన్​ను​ మారుస్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 35 ఏళ్ల రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్‌లో ఒకరిని కెప్టెన్ చెయ్యాలని టీమ్​ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో ఈ నిర్ణయం తప్పదని పలువురు నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు.

దేశవాళీలు, ఐపీఎల్‌లో అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్​లు ఆడి తన సత్తా చాటుకుంటున్నాడు. తాను ఆడుతున్న జట్టుకు మరపురాని విజయాలు అందించాడు సూర్యకుమార్ యాదవ్. టీ20 ప్రపంచకప్​లో భారత్ తరఫున కూడా అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. ఈ ప్రపంచకప్‌లో భారత్ ఓడినా.. జట్టు మొత్తంలో రాణించిన బ్యాటర్లలో సూర్య కుమార్​ ఒకడు. అయితే అతడు కేవలం బ్యాటరే కాదని, మంచి నాయకుడు కూడా అని వినాయక్​ మానే అన్నాడు. అయితే సూర్యకుమార్​తో కలిసి క్లబ్ క్రికెట్ ఆడిన అతడు పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

సూర్యకు మంచి క్రికెటింగ్ బ్రెయిన్ ఉందన్న మానే.. అతడు అద్భుతమైన వ్యూహాలు వేస్తాడని మెచ్చుకున్నాడు. "నన్నడిగితే జట్టుకు కెప్టెన్ అవడానికి సూర్య సిద్దంగా ఉన్నాడు. అతనికి కొత్తగా ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. నేను సెలెక్టర్‌ను కాదు కానీ.. సూర్యను చాలా దగ్గర నుంచి చూశా. అతను మైదానంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలడో నాకు తెలుసు. కెప్టెన్ రేసులో అతను బలమైన అభ్యర్థి అని నా నమ్మకం" అని మానే అన్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడుతూ కూడా ఖాళీ దొరికినప్పుడల్లా వినాయక్ మానేతో కలిసి క్లబ్ క్రికెట్ ఆడటం సూర్య మర్చిపోలేదు. దేశవాళీల్లో కూడా ఆడుతూనే ఉన్నాడు. ఈ స్టేజ్‌లో కెప్టెన్‌గా చేసిన అనుభవం కూడా సూర్యకు ఉంది. 2014-15 రంజీ ట్రోఫీలో ముంబయి జట్టుకు నాయకత్వం వహించిన సూర్య.. బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలని చెప్పి సీజన్ మధ్యలోనే తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే అతనిపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్ 2019-20 సీజన్‌లో మళ్లీ అతనికే జట్టు పగ్గాలు అందించింది. 2021-2022 సీజన్‌లో కూడా సూర్యనే ముంబయి జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు.

ఇదీ చదవండి:'టీ20, వన్డేలకు వేర్వేరుగా టీమ్​లను రెడీ చేసుకోవాల్సిందే!'

క్రికెట్​కు వీడ్కోలు పలకనున్న ఆసీస్ స్టార్​​ ఓపెనర్​!

ABOUT THE AUTHOR

...view details