Rohithsharma surya kumar yadav: టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు సూర్యకుమార్ యాదవ్. ఆటపరంగా తాను కష్టసమయాల్లో ఉన్నప్పుడు హిట్‌మ్యాన్ ఎలా ప్రోత్సహించాడో వివరించాడు.
"రోహిత్‌తో నాకు మంది అనుబంధం ఉంది. ముంబయి తరఫున దేశవాళి క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి అతడు నా ఆటను గమనిస్తున్నాడు. నాతో మాట్లాడుతూ.. సూచనలు ఇస్తున్నాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. 2018-19లో జరగిన ఓ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. ఒత్తిడి సందర్భాలను ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎలా అధిగమించాలి, ఇలాంటి సందర్భాల్లో ఆటగాడిగా మనల్ని మనం ఎలా మెరుగుపరచుకోవాలి వంటి విషయాలను చాలా చర్చించుకున్నాం. అతడు జట్టును అద్భుతంగా నడిపిస్తాడు. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. 2021 ఐపీఎల్ రెండో దశలో నేను క్లిష్ట దశలో ఉన్నప్పుడు నన్ను ఎంతో ప్రోత్సహించాడు. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అది నాకెంతో సంతోషానిచ్చింది. ఇక వన్డే క్రికెట్లోనూ ఇదే మైండ్సెడ్తో ఆడుతున్నా. ఎందుకంటే సహజసిద్ధమైన ఆటను ఆడటం చాలా ముఖ్యం. వన్డేలో సర్కిల్ లోపల ఐదు ఫీల్డర్లు ఉండే అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ పరుగులు చేయాలనే ఉద్దేశంతో ఉంటాము. ఒకవేళ కొన్ని వికెట్లు పోగొట్టుకున్నప్పటికీ.. చివరివరకు స్కోరుబోర్డును పరుగులు పెట్టించడానికే ప్రయత్నిస్తాను." అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.