యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) నేటి(అక్టోబర్ 17) నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాకు ఓ మెసేజ్ ఇచ్చాడు భారత మాజీ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా(Suresh Raina News). ప్లేయర్స్ సమిష్టిగా రాణించి సారథి కోహ్లీకి(Virat Kohli News) ట్రోఫీని అందించాలని సూచించాడు. కెప్టెన్‌గా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు రైనా.
టాప్ 3 బ్యాట్స్‌మెన్‌తోనే..
"ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి మేటి జట్లు ఉన్నాయన్న విషయం టీమ్ఇండియా మార్చిపోకూడు(Suresh Raina on Virat Kohli). టీ20 క్రికెట్లో ఏదైనా జరగొచ్చు. టాప్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. మంచి ఆరంభం ఇవ్వాలి. ఈ ముగ్గురూ నిలకడగా రాణిస్తే జట్టు విజయం తథ్యం. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య కూడా మంచి హిట్టర్లే."
-సురేష్ రైనా.
యూఏఈ, ఒమన్ వేదికల్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బాగా ఆడగలడని రైనా అభిప్రాయపడ్డాడు రైనా. టీమ్‌లో శార్దూల్ రాకతో జట్టుకు మరింత బలం చేకూరిందని పేర్కొన్నాడు.