తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత పర్యటనలోనే క్రికెట్​పై ద్వేషం కలిగింది'

భారత పర్యటనతో క్రికెట్​ను అసహ్యించుకోవడం మొదలుపెట్టినట్లు ఇంగ్లాండ్ బౌలర్ డామ్ బెస్ తెలిపాడు. ఆ పర్యటన సందర్భంగా నేర్చుకున్న పాఠాలను తనను తాను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగిస్తానని అన్నాడు.

Started hating cricket during India tour
భారత పర్యటనలో క్రికెట్​పై ద్వేషం

By

Published : Apr 25, 2021, 12:24 PM IST

భారత పర్యటన సందర్భంగా క్రికెట్​పై ద్వేషం కలిగిందని తెలిపాడు ఇంగ్లాండ్ స్పిన్నర్ డామ్ బెస్. అయితే పర్యటనలో నేర్చుకున్న పాఠాలను మంచి ప్రదర్శన చేయడానికి ఉపయోగిస్తానని చెప్పాడు.

నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 17 వికెట్లు తీశాడు బెస్. కానీ, నిలకడలేమితో సతమతమయ్యాడు. దీంతో రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఈ పర్యటనలో ఇంగ్లాండ్​పై 3-1తో సిరీస్​ గెలుచుకుంది టీమ్​ఇండియా.

"భారత పర్యటన తర్వాత తగిన విరామం తీసుకున్నాను. ఎందుకంటే ఆ సమయంలో నేను నిజంగా క్రికెట్​ను ద్వేషించడం మొదలుపెట్టాను. చాలా సార్లు ఒత్తిడికి లోనయ్యా. దాని నుంచి బయటపడటం ఎంతో అవసరం."

- డామ్​ బెస్, ఇంగ్లాండ్ క్రికెటర్

ఇక, భారత్​లో బయోబబుల్​లోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు బెస్ తెలిపాడు. అందులో కేవలం క్రికెట్​ గురించే చర్చ నడిచేదని అన్నాడు. దాంతో మంచి ప్రదర్శన చేసినప్పుడు అంతా బాగానే ఉన్నా.. అలా జరగనప్పుడు పరిస్థితి కఠినంగా ఉండేదని వివరించాడు. ప్రస్తుతం కౌంటీల్లో బెస్ అదరగొడుతున్నాడు.

ఇదీ చూడండి:'అభిమానులారా.. భారత్​కు మన సహకారం అవసరం'

ABOUT THE AUTHOR

...view details