తెలంగాణ

telangana

ETV Bharat / sports

Sri Lanka World Cup 2023 : అనుభవం తక్కువ ప్రదర్శన ఎక్కువ.. ఈ లంక ప్లేయర్ల ఆట అదుర్స్​! - శ్రీలంక ప్రపంచ కప్​ 2023

Sri Lanka World Cup 2023 : వరల్డ్ కప్ 2023 ఆడుతున్న శ్రీలంక జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. వీరికి అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడిన అనుభవం పెద్దగా లేదు. కానీ వీరినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అలాంటి ప్లేయర్లు ఐదుగురు ఉన్నారు. వారెవరంటే..

Sri Lanka World Cup 2023
Sri Lanka World Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 3:56 PM IST

Sri Lanka World Cup 2023 :వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచుల్లో నెగ్గి.. టోర్నీలో ఆడేందుకు శ్రీలంక జట్టు సిద్ధమైంది. టీమ్ బలమైన ప్రదర్శనతో అందరినీ ఆకర్షిస్తుంది. ప్రస్తుతం లంక జట్టులో ఎక్కువ మంది యంగ్ ప్లేయర్లే ఉన్నారు. లంక బౌలర్లకు ఇండియన్ పిచ్​లపై మంచి అవగాహన ఉంది. పలు సిరీస్​లతో పాటు ఐపీఎల్​లో ఆడిన అనుభవమూ ఉంది. ఈ క్రమంలోనే ఈ సారి వరల్డ్ కప్ ఇండియాలో జరగనుండటం వీరికి కలిసొచ్చే అంశం. లంక బౌలర్లకు ఇండియన్ పిచ్​లపై మంచి అవగాహన ఉంది. పలు సిరీస్​లతో పాటు ఐపీఎల్​లో ఆడిన అనుభవమూ ఉంది. ఈ క్రమంలోనే ఈ సారి వరల్డ్ కప్ ఇండియాలో జరగనుండటం వీరికి కలిసొచ్చే అంశం. శ్రీలంక జట్టులో ముఖ్యంగా ఐదుగురు ప్లేయర్లు కీలక పాత్ర పోషించే అవకాశముంది. మరి ఆ ఆటగాళ్లెవరు, ఇంతకు ముందు వారి ప్రదర్శన ఎలా ఉంది అనే వివరాలు ఓ సారి చూద్దాం.

1. మహీశ్ తీక్షణ(maheesh theekshana)
ఆఫ్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ శ్రీలంక జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకడు. పెద్ద ఆటగాళ్లు కూడా ఇతని స్పిన్​ ముందు బోల్తా పడటం తప్పదు. పాత బంతితో బ్యాటర్ల కన్నుకప్పడమే కాకుండా.. కొత్త బంతితోనూ వికెట్లు తీయగలడు. వికెట్లు టేకింగ్​తో పాటు పరుగులూ ఆపగలడు. తీక్షణకు భారత మైదానాల్లో ఆడిన అనుభవం చాలా ఉంది. ఐపీఎల్​లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ఇప్పటి వరకు ఇతను 27 వన్డేలాడి 44 వికెట్లు పడగొట్టాడు. ఇతడి యావరేజ్ 4.50 గా ఉంది.

2 మతిశా పతిరన(matheesha pathirana)
యార్కర్ కింగ్ మలింగను పోలిన బౌలింగ్ యాక్షన్​తో జూనియర్ మలింగగా పేరు తెచ్చుకున్నాడు మతిశా పతిరన. తన పదునైన యార్కర్లతో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలడు. ఇతనికి కూడా ఇండియన్ పిచ్​లపై ఆడిన అనుభవం చాలానే ఉంది. తీక్షణతో పాటే పతిరన కూడా చెన్నై తరఫునే ఆడాడు. ఐపీఎల్​లో ఆ జట్టుకు కీలక బౌలర్​గా సేవలందించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఒక వైపు పరుగులు ఆపుతూ మరోవైపు వికెట్లు పడగొట్టాడు. ఇతను తన కెరీర్లో ఇప్పటివరకు 10 వన్డేలు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు.

3 కుశాల్ మెండిస్(kusal mendis)
శ్రీలంక టీమ్ వికెట్ కీపర్, బ్యాటర్ అయిన కుశాల్ మెండిస్.. ఇటీవల జరిగిన ఆసియా కప్​లో తన జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎక్కువ సేపు క్రీజులో నిలిచి ఇన్నింగ్స్ ఆడటంలో ఇతను ఎక్స్పర్ట్. చాలా రోజులుగా లంక టీమ్​కు ఆడుతూ.. మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు. ఇప్పటిదాకా 112 వన్డేల్లో 3,215 పరుగులు సాధించాడు. మెండిస్ యావరేజ్ 32.15, స్ట్రైక్ రేట్ 84.44 గా ఉంది.

4 ధనంజయ డిసిల్వా(dhananjaya de silva)
ధనంజయ డిసిల్వా శ్రీలంక జట్టులో బెస్ట్ ఆల్ రౌండర్. ఇటు బ్యాట్​తో అటు బాల్​తోనూ రాణించగలడు. బౌలింగ్​లో తన స్వింగ్​తో, బ్యాటింగ్​లో తన బ్రిలియంట్ హిట్టింగ్​తో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచగలడు. ఇప్పటిదాకా 82 వన్డేలాడిన డిసిల్వా.. 26.53 యావరేజ్, 57.24 స్ట్రైక్ రేటుతో 1725 పరుగులు చేశాడు. ఇటు 4.95 ఎకానమీతో 44 వికెట్లు పడగొట్టాడు.

5 దాసున్ శనక(dasun shanaka)
శ్రీలంక కెప్టెన్ అయిన దాసున్ శనక.. ఈ టీమ్​లో ప్రాముఖ్యం కలిగిన ఆటగాళ్లలో ఒకడు. తన నాయకత్వంతో జట్టును నడిపించడమే కాకుండా.. బౌలింగ్, బ్యాటింగ్​లోనూ రాణిస్తాడు. మరోవైపు ఫినిషర్ పాత్రనూ పోషించగలడు. శనక 67 మ్యాచుల్లో 1024 పరుగులు సాధించాడు. యావరేజ్ 22.29, స్ట్రైక్ రేట్ 92.04 గా ఉంది. మరోవైపు 5.72 ఎకానమీతో 27 వికెట్లనూ తీశాడు.

Bangladesh World Cup 2023 : బరిలోకి బంగ్లా పులులు.. మెగాటోర్నీలో వీరి ప్రభావమెంత?

World Cup 2023 Afghanistan : కాలం కలిసొస్తే పసికూనలూ పంజా విసరవచ్చు.. ఈ ప్లేయర్లతో జాగ్రత్తగా ఉండాలి!

ABOUT THE AUTHOR

...view details