తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ అలా చేస్తాడని అనుకోలేదు.. వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ గెలవడం కష్టం'

Sourav Ganguly Virat Kohli : 'విరాట్​ కోహ్లీ అలా చేస్తాడని అనుకోలేదు.. వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ గెలవడం కష్టం' అంటూ టీమ్​ఇండియా మాజీ దిగ్గజం గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్లు నెట్టింట వైరల్​ అవుతున్నాయి. అసలు గంగూలీ ఏమన్నాడంటే?

Sourav Ganguly Virat Kohli
Sourav Ganguly Virat Kohli

By

Published : Jun 12, 2023, 10:29 PM IST

Sourav Ganguly Virat Kohli : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​ షిప్​ ఫైనల్ తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దాదా కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.

స్టార్​ బ్యాటర్ విరాట్​​ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ అన్నాడు. అంతేకాదు వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ గెలవడమే కష్టమని కూడా దాదా అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ స్థానంలో కెప్టెన్సీకి రోహిత శర్మనే బెస్ట్ ఆప్షన్ అని కూడా గంగూలీ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్​ టీమ్​ను ఐదుసార్లు ఛాంపియన్​గా నిలిపిన రోహిత్ విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా అన్నాడు.

Sourav Ganguly Rohith Sharma : "విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్న తర్వాత సెలక్టర్లకు ఓ కెప్టెన్ అవసరం వచ్చింది. ఆ సమయంలో రోహిత్ బెస్ట్ అనిపించాడు. అతడు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాడు. ఆసియా కప్ గెలిచాడు. అతడే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇండియా ఆడింది. రెండేళ్ల కిందట కూడా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడి ఓడిపోయాం. టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరాం. అందుకే సెలక్టర్లు ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించే వ్యక్తినే ఎంపిక చేశారు" అని గంగూలీ వ్యాఖ్యానించాడు.

Sourav Ganguly IPL : వరల్డ్ కప్​లో సెమీస్ చేరాలంటే నాలుగైదు మ్యాచ్​లు గెలిస్తే చాలని, అదే ఐపీఎల్ గెలవాలంటే 17 మ్యాచ్​లు గెలవాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు. "నాకు రోహిత్​పై పూర్తి నమ్మకం ఉంది. అతడు (రోహిత్​), ధోనీ ఐదేసి ఐపీఎల్ టైటిల్స్ గెలిచారు. ఐపీఎల్ గెలవడం అంత సులువు కాదు. ఎందుకంటే అది కఠినమైన టోర్నీ. వరల్డ్ కప్ గెలవడం కంటే ఐపీఎల్ గెలవడం కష్టం. 14 మ్యాచ్​ల తర్వాత ప్లేఆఫ్స్ చేరుకుంటారు. వరల్డ్ కప్​లో నాలుగైదు మ్యాచ్​లలో గెలిస్తే సెమీస్ వెళ్తారు. ఐపీఎల్​లో 17 మ్యాచ్​ల తర్వాత టైటిల్ గెలుస్తారు" అని గంగూలీ అన్నాడు.

టీ20ల్లో విరాట్​@12 ఏళ్లు..
Virat Kohli T20 Career : మరోవైపు, విరాట్​ కోహ్లీ.. టీ20ల్లోకి అరంగేట్రం చేసి సోమవారంతో 10 ఏళ్లు పూర్తయింది. ఈ పన్నెండేళ్ల కాలంలో విరాట్ టీమ్ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను కోహ్లీ అందించాడు. వాటిలో ప్రత్యేకమైన ఇన్నింగ్స్​లేంటో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details