తెలంగాణ

telangana

ETV Bharat / sports

KKRకు గట్టి షాక్​ ఇచ్చిన సామ్​.. సీజన్​ మొత్తానికి దూరంగా ఉండాలని.. - ఐపీఎల్​ 2023 కోల్​కతా నైట్​ రైడర్స్​

IPL 2023 Sam Billings: ఐపీఎల్‌ 2023 మినీ వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ జట్టు బ్యాటర్‌ సామ్‌ బిల్లింగ్స్‌.. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.

IPL 2023 Sam Billings
IPL 2023 Sam Billings

By

Published : Nov 14, 2022, 5:09 PM IST

IPL 2023 Sam Billings: ఐపీఎల్‌ 2023 ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు హార్డ్‌ హిట్టర్‌, వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ సామ్‌ బిల్లింగ్స్‌.. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సోమవారం ప్రకటించాడు. ఇంగ్లీష్‌ సమ్మర్‌లో(కెంట్‌) సుదీర్ఘ ఫార్మాట్‌పై ఫోకస్‌ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిల్లింగ్స్‌ ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు.

31 ఏళ్ల బిల్లింగ్స్‌ను 2022 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. గత సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 122.46 స్ట్రయిక్‌ రేట్‌తో 24.14 సగటున 169 పరుగులు చేశాడు.
ఐపీఎల్​ సీజన్‌ 2023 ట్రేడింగ్‌లో భాగంగా కేకేఆర్‌.. రహ్మానుల్లా గుర్భాజ్‌ (అఫ్గాన్​), లోకీ ఫెర్గూసన్‌ (న్యూజిలాండ్‌)ను డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి, శార్దూల్‌ ఠాకూర్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ నుంచి తెచ్చుకుంది.

కొచ్చి వేదికగా డిసెంబర్‌ 23న జరగనున్న ఐపీఎల్‌-2023 మినీ వేలం నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితా పాటు వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ నవంబర్‌ 15ను డెడ్‌లైన్‌గా ప్రకటించింది. ప్రస్తుతానికి ముంబయి, చెన్నై జట్లు మాత్రమే తమ రిలీజ్డ్‌, రీటెయిన్డ్‌ ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐకి సమర్పించినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details