తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియా క్రీడల్లో టీమ్ఇండియా.. కెప్టెన్​గా శిఖర్​ ధావన్!​.. కోచ్​ ఎవరో తెలుసా? - ఆసియా క్రీడల్లో టీమ్ఇండియా

Asian Games 2023 : ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడలు 2023లో.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత టీమ్​ఇండియా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ ఈవెంట్​కు శిఖర్​ ధావన్​ సారథ్యంలో భారత-బీ టీమ్​ను పంపించేందుకు క్రికెట్​ బోర్డు సిద్ధమైందని బీసీసీఐ వర్గాల సమాచారం.

shikhar-dhawan
shikhar-dhawan

By

Published : Jun 30, 2023, 10:39 AM IST

Updated : Jun 30, 2023, 11:18 AM IST

asian games 2022 India : చైనాలోని హంగ్‍జావూ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్​లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడలకు భారత జట్టును పంపించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా పురుషుల జట్టు సారథ్య బాధ్యతలు.. సీనియర్ ప్లేయర్​ శిఖర్​ ధావన్​కు అప్పగించనున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ఈ జట్టుకు మాజీ దిగ్గజం వీవీఎస్​ లక్ష్మణ్​ కోచ్​గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది సెప్టెంబర్​ 23 - అక్టోబర్ 8 మధ్య ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈసారి ఆసియా క్రీడల్లో క్రికెట్ కూడా ఓ భాగమైంది. 2014 ఎడిషన్‍లో చివరిసారిగా క్రికెట్ ఈవెంట్ జరగ్గా.. అందులో భారత క్రికెట్ జట్లు పాల్గొనలేదు. ఆ తర్వాత ఎడిషన్‍లో క్రికెట్‍కు చోటు దక్కలేదు. అయితే, తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు 2023 ఆసియా గేమ్స్‌లో క్రికెట్​ను భాగం చేశారు. వచ్చింది. దీంతో భారత్ నుంచి పురుషుల, మహిళల జట్లను పంపాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య భారత మహిళల జట్టుకు ముఖ్యమైన సిరీస్‍లు ఏమీ లేవు. దీంతో భారత మహిళల ప్రధాన జట్టునే పంపాలని బీసీసీఐ నిర్ణయించుకుందని తెలుస్తోంది.

అయితే ఈ ఆసియా క్రీడలు జరిగే టైమ్​ విండోలో ఐసీసీ వన్డే వరల్డ్​ కప్​ ఉన్నందున.. పురుషుల క్రికెట్​ టీమ్​ను పంపాలా వద్దా అన్న సందిగ్ధంలో బీసీసీఐ పడింది. ఈ క్రమంలోనే ఇండియా-బీ టీమ్‍ను ఈ ఈవెంట్​కు పంపాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ టీమ్​లో ప్రపంచకప్‍ జట్టులో చోటు దక్కించుకోని భారత ఆటగాళ్లను ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ యువకులకు కెప్టెన్సీ అవకాశం ఇవ్వాలనుకుంటే.. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‍.. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోనుందని సమాచారం. అయితే ఈ విషయంపై జూలై 7న జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఆ ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్​లో మ్యాచ్​లు జరుగుతాయి.

అయితే ఇంతకుముందు ఆసియా గేమ్స్​కు తమ జట్లను పంపించబోమని బీసీసీఐ తేల్చిచెప్పింది. క్రికెట్​ను ఇప్పటివరకు ఆసియా​ గేమ్స్​లో 2010, 2014లో మాత్రమే భాగం చేశారు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వచ్చింది. ఈ ఆసియా క్రీడల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్‌, శ్రీలంక లాంటి టీమ్​లు పాల్గొన్నప్పటికీ.. భారత్​ మాత్రం తమ జట్లను పంపించలేదు.

Last Updated : Jun 30, 2023, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details