లఖ్‌నవూ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా..9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ జట్టు తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందించాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో విఫలం కావడమే జట్టు ఓటమికి దారితీసిందని ధావన్ తెలిపాడు.
"40 ఓవర్లకు 250 పరుగులు చిన్న లక్ష్యమేమి కాదు. స్వింగ్, స్పిన్ అయ్యే వికెట్‌పై మేము చాలా పరుగులు ఇచ్చాము. ఫీల్డింగ్‌లో కూడా అంతగా రాణించలేకపోయాం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాము. ఇక బ్యాటింగ్‌లో కూడా ఆరంభం మంచిగా లేదు. కానీ సంజూ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అద్భుతమైనది. ఆఖర్లో శార్దూల్, సంజూ జట్టును గెలిపిస్తారని భావించాము. ఈ మ్యాచ్ నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మా తదుపరి మ్యాచ్‌లో ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తాం" అని పేర్కొన్నాడు.
కాగా, మ్యాచ్ ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు ఆఖరి ఓవర్లలో మాత్రం తేలిపోయారు. ప్రోటీస్ బ్యాటర్లు క్లసన్, మిల్లర్ బౌండరీల వర్షం కురిపించారు. ఖరి 5 ఓవర్లలో టీమ్ఇండియా బౌలర్లు ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నారు. అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా భారత్ పేలవ ప్రదర్శన కనబరిచింది. మిల్లర్, క్లసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారివిడిచారు. ఇందుకు భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.