Shami Arjuna ward :టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ అత్యున్నత క్రీడా పురస్కారం 'అర్జునా అవార్డు' రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భారత క్రీడా మంత్రిత్వ శాఖకు ముందుగా పంపిన లిస్ట్‌లో షమీ పేరు లేదట. కానీ, 2023 వరల్డ్‌కప్‌లో అతడి అద్భుత ప్రదర్శన మేరకు, బీసీసీఐ షమీ పేరు లిస్ట్‌లో చేర్చాలని క్రీడా శాఖకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న' అవార్డుకు పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పేర్లను సిఫార్సు చేశారు. ఇక భారత్‌లో 'ఖేల్‌రత్న' తర్వాత 'అర్జున అవార్డు' రెండో అత్యున్నత క్రీడా పురస్కారంగా ఉన్న విషయం తెలిసిందే.
Shami World Cup 2023 : షమీ ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. అతడు మెగాటోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో సత్తా చాటాడు. అందులో ఏకంగా మూడుసార్లు 5 వికెట్లు, ఒకసారి 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక సెమీస్‌లో న్యూడిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనైతే బీభత్సం సృష్టించాడు షమీ. ఈ మ్యాచ్‌లో షమీ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి, టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండు వన్డేల్లో ఒక మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు షమి. ఇక డిసెంబర్ 26న ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు.