తెలంగాణ

telangana

ETV Bharat / sports

గాయంతో చేతికి కుట్లు.. అయినా సెంచరీతో రెచ్చిపోయిన కోహ్లీ.. ఇన్నింగ్స్​ గుర్తుందా? - కోహ్లీ ఐపీఎల్​ సెంచరీ కుట్లు

మరో మూడు రోజుల్లో ఐపీఎల్​ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఆర్సీబీ ప్లేయర్​ కోహ్లీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్​ను గుర్తుచేసుకున్నాడు టీమ్​ఇండియా మాజీ ఆల్‌ రౌండర్‌ సంజయ్‌ బాంగర్‌. ఆ వివరాలు..

Virat Kohli stitches ipl
గాయంతో చేతికి కుట్లు.. అయినా సెంచరీతో రెచ్చిపోయిన కోహ్లీ.. ఇన్నింగ్స్​ గుర్తుందా?

By

Published : Mar 28, 2023, 6:55 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ 16వ సీజన్​.. మార్చి 31 నుంచి గ్రాండ్​గా మొదలుకానుంది. అయితే ఈ మెగాటోర్నీలో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరుకు ట్రోఫీ అందని ద్రాక్షలా మిగిలిపోయింది. ప్రతిసీజన్​లోనూ ఫేవరెట్​గా బరిలోకి దిగిడం ట్రోఫీని ముద్దాడకుండానే వెనుదిరగడం అలవాటైపోయింది. అయితే ఈ సీజన్​లోనైనా.. ఎలాగైనా టైటిల్​ను దక్కించుకోవాలని పట్టుదలతో సిద్ధమవుతోంది. ఎప్పటిలాగే ఆ జట్టు మరోసారి విరాట్​పైనే భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సారైనా కోహ్లీ తన ధనాధన్ ఇన్నింగ్స్​తో.. జట్టుకు ట్రోఫిని అందించాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. అయితే తాజాగా.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో కోహ్లీ జర్నీ 15 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ పార్ట్‌నర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ ఓ స్పెషల్​ వీడియోను రూపొందించి పోస్ట్ చేసింది. విరాట్​తో అనుబంధం ఉన్న పలువురు మాజీ క్రికెటర్లను ఓ చోటకు చేర్చి.. కోహ్లీతో వారికున్న అనుభవాలను తెలియజేసింది.

ఈ సందర్భంగా టీమ్​ఇండియా మాజీ ఆల్‌ రౌండర్‌ సంజయ్‌ బాంగర్‌.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 2016 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో కోహ్లీ చేతికి కుట్లు పడినా.. ఆ బాధను భరిస్తూనే విధ్వంసకర సెంచరీ చేసిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. కోహ్లీకి ఉన్న పట్టుదల, అతడికి ఆట పట్ల ఉన్న అంకితభావం ఎలాంటిదో తెలియజేయడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని బాంగర్‌ వివరించాడు. కాగా, వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో ఫస్ట్​ బ్యాటింగ్​కు దిగిన ఆర్సీబీ.. విరాట్‌ కోహ్లీ (50 బంతుల్లో 113; 12x4, 8x6) విధ్వంసకర సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 211 రన్స్​ చేసింది. ఇక ఇదే మ్యాచ్​లో విరాట్​కు తోడుగా క్రిస్‌ గేల్‌ (32 బంతుల్లో 73; 4x4, 8x6) కూడా ధనాధన్​ ఇన్నింగ్​తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పంజాబ్‌.. 14 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 82 పరుగుల తేడాతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఓటమిని అందుకుంది. ఇకపోతే ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడాడు విరాట్​. 81.08 యావరేజ్​తో రికార్డు స్థాయిలో 973 రన్స్​ చేశాడు. ఇప్పటికీ ఈ ఐపీఎల్‌ చరిత్రలో.. ఓ సీజన్‌లో ఓ ప్లేయర్​ సాధించిన అత్యధిక పరుగులు ఇదే కావడం విశేషం.

ఇదీ చూడండి:కేజీయఫ్ స్టైల్​లో ధోనీ ఎంట్రీ.. చెపాక్ స్టేడియం దద్దరిల్లిందిగా!

ABOUT THE AUTHOR

...view details