ఐపీఎల్-2021(ipl 2021 news)లోనూ అభిమానులకు నిరాశే మిగిల్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bangalore 2021). జట్టు ఓటమి కంటే ఈ సీజన్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం వారికి మరింత ఆవేదన మిగిల్చింది. ఈ నేపథ్యంలో జట్టును మరింత బలంగా తయారు చేసేందుకు సిద్ధమైంది ఆర్సీబీ. వచ్చే సీజన్‌కు ముందు మెగావేలం జరగనున్న క్రమంలో కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్‌ను కూడా మార్చింది. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్(sanjay bangar rcb coach)ను ప్రధాన కోచ్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఆర్సీబీ కొత్త కోచ్‌గా బంగర్.. రెండేళ్లకు ఒప్పందం
వచ్చే రెండు ఐపీఎల్(ipl 2021 news) సీజన్ల కోసం కొత్త కోచ్‌ను నియమించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bangalore 2022). ప్రస్తుతం ఆ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్(sanjay bangar rcb coach)కు హెడ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. గత సీజన్లో కోచ్‌గా ఉన్న మైక్ హసెన్.. జట్టు క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు.
గతేడాది మొదటి విడతలో ఆర్సీబీకి కోచ్‌గా ఉన్నాడు సైమన్ కటిచ్. యూఏఈ వేదికగా జరిగిన రెండో విడతకు అతడు అందుబాటులో ఉండట్లేదని తెలిపాడు. దీంతో మైక్ హెసన్(mike hesson rcb news)కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇతడి పర్యవేక్షణలో జట్టు టైటిల్ సాధించడంలో విఫలమైనందున మరోసారి కొత్త కోచ్‌ను తీసుకుంది. ప్రస్తుతం ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్(sanjay bangar rcb coach)ను ప్రధాన కోచ్‌గా నియమించింది. ఇతడు ఆర్సీబీకి వచ్చే రెండు సీజన్లకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. మైక్ హెసన్ జట్టు క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు.
ఐపీఎల్-2022(ipl 2022 news) వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. అంతకుముందు జనవరిలో మెగా వేలం(ipl 2022 mega auction) నిర్వహించనున్నారు. ఈ సీజన్లో మరో రెండు కొత్త జట్లు(ipl 2022 new teams) పాల్గొననున్న నేపథ్యంలో ఈసారి వేలంపై అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నా.. ఆటగాడిగా అదే జట్టుతో కొనసాగనున్నాడు. దీంతో కొత్త కెప్టెన్ వేటలో పడింది ఆర్సీబీ యాజమాన్యం. ఈ జాబితాలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.