క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా టీమ్ఇండియా క్రికెటర్లు, మాజీలు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పటికే సచిన్ అభిమానులు పోస్టులతో ఆయన పేరు ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేశ్ బాబు కూడా మాస్టర్‌కు విషెస్ చెప్పారు.
"మీరు కోట్లమంది గుండెల్ని గెలిచారు. కోట్లమంది భావోద్వేగాల్ని కదిలించారు. కోట్లమంది కలల్ని మేల్కొలిపారు. అలాగే కోట్లమందికి స్ఫూర్తిగా నిలిచారు. అయినా ఇంకా వినయంగా, గొప్పగా ఉంటారు. ప్రియమైన సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు." -చిరంజీవి, నటుడు
"క్రికెట్ అర్థాన్ని మార్చి.. ఆటకు మారుపేరుగా నిలిచిన సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరెప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా." -మహేశ్ బాబు, నటుడు